Short News

డిబెంచర్ల జారీ చేసిన ఎయిర్‌టెల్‌

డిబెంచర్ల జారీ చేసిన ఎయిర్‌టెల్‌

దేశంలోనే అతిపెద్ద టెలికామ్‌ ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్‌ నిధుల సమీకరణకు డిబెంచర్ల మార్గాన్ని ఎంచుకుంది. రూ.3,000 కోట్లు సమీకరించేందుకు 30,000 డిబెంచర్లను విక్రయించనుంది. 2017మార్చి 14న పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కంపెనీ షేర్‌ హోల్డర్లు దీనికి ఆమోద ముద్ర వేశారని తెలిపింది. మొత్తం రెండు సిరీస్‌ల్లో ఈ డిబెంచర్లను కేటాయిస్తారు. ఒక్కో సిరీస్‌లో రూ.1500 కోట్లు విలువైన డిబెంచర్లను జారీ చేస్తారు. సిరీస్‌ 1 డిబెంచర్లకు 8.25శాతం, సిరీస్‌ -2లో జారీ చేసే డిబెంచర్లకు 8.35శాతం చెల్లిస్తారు.
అమెరికా  చైనా మధ్య ముదురుతున్న ‘ట్రేడ్‌వార్‌ ’

అమెరికా చైనా మధ్య ముదురుతున్న ‘ట్రేడ్‌వార్‌ ’

అమెరికా చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ ముదురుతోంది. చైనా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం గురువారం సంతకం చేసింది. దీనిపై కౌంటర్ ఎటాక్ చేసిన చైనా.. తమ దేశంలో అమెరికా వస్తువుల దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు జీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించింది. త్వరలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ను ఆశ్రయించనుంది. అమెరికాపై చట్టపరమైన చర్యలను కోరనున్నామని చైనా ఒక ప్రకటనలో తెలిపింది.  
ఎడ్డేమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం

ఎడ్డేమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం

డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి కేంద్రం చర్యలు ప్రతిపాదిస్తూ ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై ఎడాపెడా ఫీజు వసూలు చేస్తున్నాయి.చెక్‌కు సరిపడా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోతే సంబంధిత ఖాతాదారుడిపై భారీగా జరిమానా వడ్డిస్తున్నాయి బ్యాంకులు. కనుక బ్యాంకుల నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్‌ల ఆధారంగా లావాదేవీలు జరుపాలని కోరుతున్నారు.ఇక ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు జారీ చేసిన చెక్కులు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి చెల్లబోవని తేల్చేసింది.

మళ్లీ సెక్యూరిటీ అడ్వైజర్‌ను మార్చిన ట్రంప్

మళ్లీ సెక్యూరిటీ అడ్వైజర్‌ను మార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాంపౌండ్ లో అధికారుల,సలహాదారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. ఆయన ఎన్‌ఎస్‌ఏ చీఫ్ హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్‌ను మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో జాన్ బోల్టన్‌ను ట్రంప్ నియమించారు. ఏప్రిల్ 9న బోల్టన్ బాధ్యతలు స్వీకరిస్తారు. మెక్‌మాస్టర్ తనకు ఓ ఫ్రెండ్ అని, అద్భుతమైన ఉద్యోగం చేశారని ట్రంప్ మెచ్చుకున్నారు. దేశాధ్యక్షుడికి ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉందని బోల్టన్ తెలిపారు. ట్రంప్‌కు సెక్యూరిటీ అడ్వైజర్ మారడం గత 14 నెలల్లో ఇది మూడవ సారి.