Short News

స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు భారీ రుణ ఆఫ‌ర్‌

స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు భారీ రుణ ఆఫ‌ర్‌

స్వయం సహాయ సంఘాలకు ఒక్కో గ్రూపునకు రూ.25 లక్షల వరకు రుణం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు యోచిస్తోంది. సెక్యూరిటీ లేకుండా ఈ రుణాన్ని అందజేస్తామని బ్యాంకు చైర్మన్‌ నర్సిరెడ్డి తెలిపారు. మ‌రోవైపు కాగిత ర‌హిత‌(గ్రీన్‌ బ్యాంకింగ్‌) ప‌ని విధానం దిశగా అడుగులేస్తున్నామని ఆయ‌న‌ చెప్పారు. 45 లక్షల బ్యాంకు ఖాతాల్లో 95 శాతం ఆధార్‌కు అనుసంధానం అయ్యాయని చెప్పారు. ‘ఆధార్‌ను ఆధారంగా లావాదేవీలు పూర్తి చేసుకునే అవకాశం ఉండడం గ్రీన్‌ బ్యాంకింగ్‌ ప్రత్యేకత. నెల రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం' అని ఆయ‌న వివరించారు.
డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

ఎండాకాలం వచ్చిందంటే కొన్ని చర్మ సమస్యలు కూడా వెంట వస్తాయి. వేసవిని ఆనందంగానే స్వాగతిస్తాము. అయితే, వేసవితో పాటు వెంట వచ్చే చర్మ సమస్యలు మనల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అందులో ముఖ్యంగా మనం సన్ బర్న్ సమస్య గురించి చెప్పుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం కమిలినట్లు మారుతుంది. దీనినే సన్ బర్న్ అనంటారు. సూర్యరశ్మిలో కొన్ని హానికర కిరణాలు చర్మాన్ని తాకడం వలన చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. పీఎన్‌బీని భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి చెందిన రూ.170 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఆస్తుల అటాచ్‌మెంట్‌ మాత్రమే కాక నీరవ్‌ మోదీ, అత‌డి సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ అటాచ్‌ చేసుకుంది.    
బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయట. రోజుకు 2, 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. లివర్‌లో ఉన్న కొవ్వు కరుగుతుంది. నిత్యం 2 కప్పుల కన్నా ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.