Short News

నేటి నుంచి ఇ-వే బిల్లు విధానం అమలు

నేటి నుంచి ఇ-వే బిల్లు విధానం అమలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో ఆదివారం నుంచి ఇ-వే బిల్లుల విధానం అమల్లోకి వస్తోంది. దీంతో ఈ రాష్ట్రాల్లోపల రూ.50 వేలు మించిన సరుకులను ఒక కిలోమీటర్‌కు మించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించాలన్నా ఇ-వే బిల్లు తప్పనిసరి. ఈ నెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ‘ఇ-వే' బిల్లుల్లో 61 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే జారీ అవుతున్నాయి. వచ్చే నెలాఖరుకల్లా దశలవారీగా అన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రంలో జరిగే సరుకుల రవాణాకూ ఇ-వే బిల్లులు జారీ చేయాలి.
రిటైర్ మెంట్ ఎప్పుడో  ''అప్పుడు''  ప్ర‌క‌టిస్తాః యువ‌రాజ్‌

రిటైర్ మెంట్ ఎప్పుడో ''అప్పుడు'' ప్ర‌క‌టిస్తాః యువ‌రాజ్‌

టీమిండియా హార్డ్ హిట్ట‌ర్ యువ‌రాజ్ సింగ్ త్వ‌ర‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నాడా? ఈ ప్ర‌శ్న‌కు తాజాగా యువ‌రాజ్ సింగ్ జ‌వాబు చెప్పాడు. `నేను 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. నా రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అయితే ఫార్మాట్ ఏదైనా 2019 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు క్రికెట్ ఆడాల‌నుకుంటున్నా. వ‌చ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జ‌రిగే 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాల‌నుకుంటున్నా. ఆ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా. అప్ప‌టివ‌రకు వేచి చూసి రిటైర్మెంట్‌పై నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా` అని యువీ చెప్పాడు.  
మళ్లీ బాలయ్య, వీవీ వినాయక్ కాంబినేషన్

మళ్లీ బాలయ్య, వీవీ వినాయక్ కాంబినేషన్

16 ఏళ్ల తర్వాత నటుడు నందమూరి బాలకృష్ణ,దర్శకుడు వీవీ వినాయక్ కాంబినేషన్ రిపీట్ కానుంది. 2002లో వినాయక్‌ దర్శకత్వంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలయ్య నటించారు. బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (ఎన్టీఆర్ బయోపిక్‌) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే వినాయక్ సినిమాను ఫైనల్‌ చేశారు బాలకృష్ణ.ఈ సినిమాను మేలో ప్రారంభించి 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేలాప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ సూపర్‌ హిట్ మఫ్టీ కి రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది.  
పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క ప‌నులు ప్రారంభం

పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క ప‌నులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో మరో అతి కీలక నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఇవాళ ఉదయం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చేరుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం స్పిల్‌ ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. అనంతరం డయా ఫ్రం వాల్‌ను సీఎం పరిశీలించారు. గోదావరి నది మళ్లింపును పరిశీలించిన చంద్రబాబు ఆ న‌ది నీటిని తలపై చల్లుకున్నారు.