Short News

కర్నాటక ప్రభావం..నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కర్నాటక ప్రభావం..నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కర్ణాటక ఎన్నికల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 156 పాయింట్లు కిందకి పడిపోయి 35,388 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు దిగజారి 10,800 మార్కుకు కింద 10,741 వద్ద స్థిరపడింది. కన్నడ నాట ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కోలు ఒత్తిడిని ఎదుర్కొనగా.. ఐటీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌లు 4 శాతం మేర లాభాలు పొందాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసల లాభంలో 67.82 వద్ద నమోదైంది.
ఢిల్లీ స్క్రిప్టుతో పవన్! జగన్ లాలూచీ: కేంద్రంపై బాబు

ఢిల్లీ స్క్రిప్టుతో పవన్! జగన్ లాలూచీ: కేంద్రంపై బాబు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు.'మనం న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ ధర్మపోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలందరికీ పాదాభివందనాలు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి విశాఖ ముఖద్వారం. దేనికి మనం పోరాటం చేస్తున్నామో అంతా ఆలోచించాలి. మన స్వార్థం కోసం కాదు. జాతి ప్రయోజనాల కోసం. భావితరాల భవిష్యత్తు కోసమే' అని అన్నారు.

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

క్వాంటికో టెలివిజన్ సిరీస్ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా కొంత విరామం తర్వాత బాలీవుడ్‌లో నటిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ అనే చిత్రం చేస్తున్న ఈ భామ సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రాన్ని అంగీకరించింది. 'ఇమ్యునోడెఫిషియన్సీ' వ్యాధితో మృతి చెందిన 18 ఏళ్ళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రంలో అయేషాగా జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తుందని సమాచారం. ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ నటించే అవకాశాలున్నాయి.  పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలి ఏసీ బస్ షెల్టర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంగళవారం ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాధించింది.