Short News

ఫిబ్రవరి 14న 'ది ఫ్లిప్‌హార్ట్‌ డే' సేల్

ఫిబ్రవరి 14న 'ది ఫ్లిప్‌హార్ట్‌ డే' సేల్

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 'వాలెంటైన్స్‌ డే' సేల్ ప్రారంభించబోతుంది. ఫిబ్రవరి 14న 'ది ఫ్లిప్‌హార్ట్‌ డే' సేల్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 14 శాతం డిస్కౌంట్‌ను అందించనుంది. 'ది ఫ్లిప్‌హార్ట్‌ డే' ఆఫర్‌లో సైన్‌-అప్‌ అయ్యేవారికి 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 80 శాతం వరకూ, టీవీ, హోమ్‌ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను అందించనుంది.
న‌క్సల్స్ చ‌ర్య‌ల‌తో గిరిజ‌నుల్లో ఆందోళ‌న‌

న‌క్సల్స్ చ‌ర్య‌ల‌తో గిరిజ‌నుల్లో ఆందోళ‌న‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం పెడమిడిసిలేరు-తాలిపేరు ప్రాజెక్టు మధ్యగల కాజ్‌వేని నిషిద్ధ మావోయిస్టు నక్సలైట్లు ధ్వంసం చేశారు. దీంతో సమీప గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఏజెన్సీలో నక్సలైట్లు ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పక్కనే ఉన్న దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇప్పటికే ఆయా ఘటనలకు పాల్పడ్డ నక్సలైట్లు తాజాగా కాజ్ వే ను ధ్వంసం చేయడంతో గిరిజన ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.   
కల్యాణ్ రామ్ కు క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

కల్యాణ్ రామ్ కు క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

బుధవారం నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈసినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు.  మే 2 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. శేఖర్‌ చంద్ర సంగీతం అందించనున్నారు. ఇందులో కల్యాణ్‌రామ్‌కు జోడీగా నివేదా థామస్‌, షాలిని పాండే నటించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవీ గుహన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

ఆన్‌లైన్ ఫోటో షేరింగ్ విభాగంలో అగ్రగామి యాప్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త కస్టమర్‌ల తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సెప్టంబర్ 2017లో టెక్‌క్రంచ్ రివీల్ చేసిన పలు రిపోర్ట్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ సేవలను ప్రతి నెలా 80 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. ఇక యాక్టివ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి ప్రతి రోజు ఈ యాప్‌ను 50 కోట్ల మంది యాక్టివ్‌గా వినియోగించుకుంటున్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.