Short News

మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

పసిడి ధర మరింత పడిపోయింది. బుధవారం ఒక్కరోజే రూ.430 తగ్గిన బంగారం ధర నేడు మరింత తగ్గింది. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్‌ లేమి కారణంతో పసిడి ధర రూ.32 వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. గురువారం బంగారం ధర రూ.240 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,780కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారులు, రిటైలర్ల దగ్గర నుంచి డిమాండ్‌ లేకపోవడం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం ధరపై పడుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పుంజుకుంది. రూ.100 పెరగడంతో కిలో వెండి రూ.40,750కి చేరింది.   
‘కాలా’ను క‌ర్ణాట‌క‌లో విడుద‌ల కానివ్వం

‘కాలా’ను క‌ర్ణాట‌క‌లో విడుద‌ల కానివ్వం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా ‘కాలా'పై కన్నడనాట నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కావేరి జలాల విషయంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని కన్నడ చళువళి వాటాల్‌ పార్టీ అధ్యక్షుడు వాటాల్‌ నాగరాజ్‌ తెలిపారు. కర్ణాటకవాడైన రజనీకాంత్‌ సొంత రాష్ట్రమని కూడా మమకారం చూపకుండా కావేరి నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయటం సమంజసం కాదన్నారు. రజనీకాంత్‌ సినిమాలతో పాటు కమల్‌హాసన్‌ సినిమాలను కూడా అడ్డుకొంటామన్నారు. పలు కన్నడ సంఘాలు కూడా కాలాను అడ్డుకుంటామని శనివారం ప్రకటించాయి.   
ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు, ఆ ముగ్గురే టార్గెట్!

ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు, ఆ ముగ్గురే టార్గెట్!

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలో 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో మహానాడు జరగనున్న నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. మహానాడుకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్టు తెలిపారు. రెండువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, వలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు.

శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నానికి 24 గంట‌లు

శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నానికి 24 గంట‌లు

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల తాకిడితో క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంతో పాటు ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునే భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతోంది.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more