Short News

తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

సోమవారం నాటి మార్కెట్‌లో బంగారం ధరలు కిందకి పడిపోయాయి. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ తగ్గడం, అంతర్జాతీయంగా ప్రతికూలంగా వస్తుండటంతో, బంగారం ధరలు నేటి మార్కెట్‌లో 10 గ్రాములకు రూ.32000గా నమోదయ్యాయి. వెండి ధరలు కేజీ రూ.39,900గా రికార్డయ్యాయి. గ్లోబల్‌గా కూడా బంగారం ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా ఉంది. సిల్వర్‌ 16.57 డాలర్లుగా నమోదైంది. అక్షయ తృతీయ దగ్గర పడుతున్న తరుణంలో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలలో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.  
బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బేటీ బచావో, బేటీ పడావో అన్నది మోదీ పాత నినాదమని, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బచావో అంటున్నారని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ ఇవాళ ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో రాహుల్ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో సుమారు రెండు కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారన్నారు. తమ మనసుల్లో ఏముందో 2019లో ప్రజలు మన్‌కీ బాత్ ద్వారా వెల్లడిస్తారని చ‌మ‌త్క‌రించారు.    
మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్ మరో సినిమా

మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్ మరో సినిమా

ఇటీవల ఎమ్మెల్యే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు కల్యాణ్ రామ్. నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే మరో సినిమా చేయబోతున్నాడట. ఏప్రిల్‌ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  నివేదా థామస్‌, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు.
పోర్న్‌కు బానిస: తల్లిపై  అత్యాచారయత్నం

పోర్న్‌కు బానిస: తల్లిపై అత్యాచారయత్నం

మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఫోర్న్‌కు బానిసగా మారిన ఓ యువకుడు కన్నతల్లిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.అయితే ఈ విషయమై బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఫోర్న్‌కు బానిసగా మారిన ఓ యువకుడు తల్లిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్‌టౌన్‌లో చోటుచేసుకొంది. గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ టౌన్‌లో రాకేష్ కుటుంబం నివసిస్తోంది.