Short News

ఇండియాలో తగ్గనున్న హర్లే డేవిడ్సన్‌  ధరలు

ఇండియాలో తగ్గనున్న హర్లే డేవిడ్సన్‌ ధరలు

హర్లే డేవిడ్సన్‌, ట్రయంఫ్‌ లాంటి లగ్జరీ ద్విచక్రవాహనాలపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 800సీసీ, అంతకంటే తక్కువ ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న హై ఎండ్‌ బైక్‌లపై 60శాతం,  ఎక్కువ ఇంజిన్‌ కెపాసిటీ ఉన్న బైక్‌లపై 75శాతం కస్టమ్స్‌ సుంకం ఉండేది. తాజాగా వీటిపై ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 50శాతానికి తగ్గిస్తూ సీబీఈసీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో బైక్‌ల ధరలు తగ్గనున్నాయి. 
విశాఖ జిల్లాలో ప‌డ‌గ విప్పుతున్న ఆంత్రాక్స్‌!

విశాఖ జిల్లాలో ప‌డ‌గ విప్పుతున్న ఆంత్రాక్స్‌!

విశాఖ మన్యంలో మరో నలుగురికి ఆంత్రాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ గెంజిగెడ్డలో నలుగురికి చేతులకు పుళ్లు పడటంతో వైద్య సిబ్బంది హుటాహుటిన చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంత్రాక్స్‌పై సమీక్ష నిర్వహిస్తుండగానే ఈ విషయం బయటపడటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. గిరిజన ప్రాంతంలో ఆంత్రాక్స్‌ వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. నిన్న గూడెం కొత్తవీధి దామనాలపల్లి మాడెంలో ఏడుగురు ఆంత్రాక్స్‌ బాధితులను వైజాగ్‌ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.   
అక్క‌డ నిర‌స‌న‌ల‌పై మిర‌ప కాయ బాంబులు వేయ‌బోతున్నారా?

అక్క‌డ నిర‌స‌న‌ల‌పై మిర‌ప కాయ బాంబులు వేయ‌బోతున్నారా?

కశ్మీరులో సైనిక దళాలపై రాళ్ళు విసిరే మూకలకు గుణపాఠం చెప్పేందుకు పారా మిలిటరీ దళాలు అనేక అంశాలను పరిశీలిస్తున్నాయి. పెల్లెట్ గన్స్ వాడ‌కంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన‌ నేపథ్యంలో బాష్ప వాయు గోళాలు, మిరపకాయ బాంబులను ప్రయోగించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాష్పవాయు గోళాలపై ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిని సున్నితమైన ప్లాస్టిక్‌తో తయారు చేశారు. వీటిని ప్రయోగించినపుడు నిరసనకారులకు తీవ్రమైన గాయాలు తగిలే అవకాశం ఉండదు. మిరపకాయ బాంబులను ప్రస్తుతం కశ్మీరులో ప‌రిశీలిస్తున్నారు. 
రూ.200 కోట్ల క్లబ్ లో ‘రంగస్థలం’

రూ.200 కోట్ల క్లబ్ లో ‘రంగస్థలం’

రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం రంగస్థలం. ఈసినిమా కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. గత నెల 30న విడుదలైన ఈ సినిమా మ‌రో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవైపు భరత్ అనే నేను రీలీజై మంచి టాక్ తో నడుస్తున్నా.. రంగస్థలం మాత్రం కలెక్షన్ల వసూళ్లలో దూసుకుపోతుంది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.