Short News

ఇకపై హైక్‌తో 'ఓలా' బుక్ చేసుకోవచ్చు

ఇకపై హైక్‌తో 'ఓలా' బుక్ చేసుకోవచ్చు

మెసేజింగ్‌ యాప్‌ 'హైక్‌'తో క్యాబ్ సంస్థ 'ఓలా' సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై ఓలా కారును, ఆటోలను హైక్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొని హైక్‌ వ్యాలెట్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చని హైక్‌ వ్యవస్థాపకులు కవిన్‌ భారతీ మిట్టల్‌ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవల లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఓలా పేర్కొంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) బుధవారం కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1950 డిసెంబర్‌ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి (67) బుధవారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.1950 డిసెంబర్ 25వ తేదిన ఆనం వివేకానంద రెడ్డి జన్మించారు. ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కొడుకులు. మూడు దఫాలు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు.1999 నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏప్రిల్ 26వ తేదిన నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు నేడు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపర్ల అప్రమత్తతో ఆరంభం నుంచే సూచీలు నష్టాల బాట పట్టాయి. మార్కెట్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకు పైగా కోల్పోయింది.  సెన్సెక్స్‌ 28 పాయింట్ల స్వల్ప నష్టంతో 34,589 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 10,603 వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహింద్రా, విప్రో తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.