Short News

అసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ

అసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ

ఇండియాలోనే కాదు..ఆసియామొత్తంలో ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ నిలిచారు. చైనాకు చెందిన బిలియనీర్, అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. శుక్రవారం రిలయెన్స్ లిమిటెడ్ షేరు ధర 1.6 శాతం పెరిగి 1099.8కి చేరడంతో ముకేశ్ సంపద కూడా భారీగా పెరిగింది. అంబానీ సంపద 4430 కోట్ల డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అదే సమయంలో జాక్ మా సంపద 4400 కోట్ల డాలర్లుగా ఉంది.  ఈ ఏడాది అంబానీ సంపద 400 కోట్ల డాలర్లు పెరగడం విశేషం.
భారత నావికదళ స్థావరాలపై దాడులకు ఉగ్రవాదుల ప్లాన్

భారత నావికదళ స్థావరాలపై దాడులకు ఉగ్రవాదుల ప్లాన్

భారత నావికదళ స్థావరాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ టెర్రరిస్టులు సిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్‌లోని భవల్పూర్‌ వద్ద జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులకు పాక్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణలో భాగంగా భారత నావికాదళ స్థావరాలపై దాడులు చేసే పద్ధతులను నేర్పించారు. దీంతోపాటు సముద్రపు లోతుల్లో ఆయుధ వినియోగంపై వారికి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో భారత కీలక జలాంతర్గాములను నిలిపే విశాఖపట్టణం పోర్టుపై నిఘాను మరింత పెంచారు.
అవిశ్వాసానికి ఓకే కానీ: బాబుకు జేసీ ఊహించని షాక్

అవిశ్వాసానికి ఓకే కానీ: బాబుకు జేసీ ఊహించని షాక్

తెలుగుదేశం పార్టీ అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యాక తాను తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటన చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనడంతో పాటు పలు కారణాలతో జేసీ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను అవిశ్వాస తీర్మానానికి హాజరుకాబోనని బుధవారం ప్రకటించారు. దీంతో టీడీపీలో కలకలం ప్రారంభమైంది. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం నిధుల కోసం జీవో విడుదల చేస్తే కథ సుఖాంతమవుతుందనుకున్నారు. కానీ రివర్స్ అయింది.

ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ ;10 బెస్ట్ ఫుడ్స్

ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ ;10 బెస్ట్ ఫుడ్స్

ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం, ఇవి శరీరం సరిగ్గా పనిచేసేలా చేస్తాయి.అందుకని ఈ ఆర్టికల్ లో మనం ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ గురించి చర్చిద్దాం.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ ఓ) ప్రకారం, 235 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు.భారతదేశంలో వాతావరణ కాలుష్యం, పొగ తాగేవారి సంఖ్య పెరగటం వలన, శ్వాసకోస సమస్యలు ఎక్కువయ్యాయి.



ఈ కాలుష్యం నిండిన గాలిని ఊపిరితిత్తులు వరుసగా పీలుస్తూపోతే, ఈ కలుషితాలు శ్వాసకోస సమస్యలైన బ్రాంకైటిస్, ఆస్తమా, న్యుమోనియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వాటి రిస్క్ ను పెంచుతూ పోతాయి.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more