Short News

పాపులారిటీలో ఇన్ఫోసిస్‌కు 9వ స్థానం

పాపులారిటీలో ఇన్ఫోసిస్‌కు 9వ స్థానం

ఐటీ ఇండస్ట్రీలో టాప్‌ కంపెనీలకు క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లాంటి దిగ్గజ దేశీయ అవుట్‌ సోర్సింగ్‌ కంపెనీలకు పాపులారిటీ పెరిగిందని యూనివర్సమ్స్‌ యాన్యువల్‌ సర్వేలో తేలింది. 1.3 మిలియన్‌ పైగా అభ్యర్థులు పాల్గొన్న ఈ సర్వేలో ఇన్ఫోసిస్‌ 9వ ర్యాంక్‌ను సంపాదించుకుంది. టీసీఎస్‌, విప్రోలు 13, 20వ ర్యాంకుల్లో నిలిచాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌లు టాప్‌-5లో ఉన్నాయి. రిలయన్స్‌ 12వ ర్యాంక్‌లో నిలిచింది.
‘ముల్క్‌’ మీకోసం కాదు మాస్టర్స్‌..మిమ్మల్ని  చూస్తే జాలేస్తుంది

‘ముల్క్‌’ మీకోసం కాదు మాస్టర్స్‌..మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది

కోర్టు రూంలో జరిగే డ్రామా ప్రధానంగా నడిచే కథ ఆదాంరగా ముల్క్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అనుభవ్‌ సిన్హా. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్‌ బబ్బర్, అశుతోష్‌ రాణా, రాజత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన.. ‘ముల్క్‌' సినిమా ఆగస్ట్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తనపై ట్రోల్‌ చేస్తోన్న వారందరికి దిమ్మ తిరిగేలా ఓపెన్‌ లెటర్‌తో సమాధానమిచ్చారు ‘ముల్క్‌' దర్శకుడు అనుభవ్‌ సిన్హా. ‘‘ఈ సినిమా మీ కోసం కాదు మాస్టర్స్‌..' మిమ్మల్ని, మీ ఆలోచనా ధోరణిని చూస్తుంటే జాలి వేస్తోందని ఎద్దెవా చేశారు.
పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఆస్త్మా వ్యాధి రాదు.!

పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఆస్త్మా వ్యాధి రాదు.!

పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునేవారిలో ఆస్త్మా వ్యాధి దరిచేరదని, ఇప్పటికే ఆ వ్యాధి ఉన్నవారికి నియంత్రణలో ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. మాంసాహారం, తీపిపదార్ధాలు, సాల్ట్‌ అధికంగా ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే ఆస్త్మాను అదుపులో ఉంచడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల లోపల వాపు ద్వారా వచ్చే ఆస్త్మాను పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాల్లో ఉండే వాపును తగ్గించే పదార్ధాలు అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
నమ్మకమే జీవితం: ప్రయత్నం, పరోపకారమే రక్ష, ఎలాగంటే..?

నమ్మకమే జీవితం: ప్రయత్నం, పరోపకారమే రక్ష, ఎలాగంటే..?

మనిషికి మనుగడకు నమ్మకం ఎంతో అవసరం. నమ్మకం లేకపోతే కష్టం. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం నమ్మకంతోనే వ్యవహారం నడుస్తుంది. దీనికి ఉదహారణగా ఈ చిన్ని స్టోరీని గమనించండి. ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు.అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.నడుస్తున్నాడు. నీరు ఎక్కడా కనబడటం లేదు.తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు.రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more