Short News

స‌గానికి ప‌డిపోయిన ఐటీసీ సిగ‌రెట్ల ఆదాయం

స‌గానికి ప‌డిపోయిన ఐటీసీ సిగ‌రెట్ల ఆదాయం

భిన్న వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్‌ఎంసిజి దిగ్గజం ఐటిసి మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 9.86 శాతం వృద్ధితో 2,932.71 కోట్ల రూపాయల స్టాండ్‌ అలోన్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 2,669.47 కోట్ల రూపాయలు. గత ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో క్యు4కి జీఎ్ట‌సీకి చెల్లింపులు పోగా మిగతా రాబడినే పరిగణనలోకి తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. సిగరెట్ల వ్యాపారం ద్వారా ఆదాయం ఏకంగా సగానికి సగం తగ్గి 4,936.45 కోట్ల రూపాయలకు పడిపోయింది. 
స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వశం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఐదు చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. మొద‌టిది మొబైల్ డేటా ఆఫ్ చేయ‌డం. దీని ద్వారా మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. రెండోది రోజులో కొంత సమయం గ్యాడ్జెట్స్ ప‌క్క‌న పెట్టి ఆటలు, సంగీతం, సమాజ సేవ వంటి వాటికి స‌మ‌యం కేటాయించడం. మూడోది ఫోన్లో అన‌వ‌స‌ర క‌బుర్లు చెప్ప‌డం ఆపాలి. నాలుగు.. నిద్ర‌పోయే ముందు సెల్ ఫోన్ వాడొద్దు. చివ‌రిది.. కొన్నాళ్లు సాధార‌ణ మోడ‌ల్ ఫోన్ వాడండి.   
లోకేష్ గురించి చెప్పేదేముంది, అంతా వాళ్లిష్టం: పవన్ కళ్యాణ్

లోకేష్ గురించి చెప్పేదేముంది, అంతా వాళ్లిష్టం: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో ప్రసంగిస్తుండగా మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడాలని జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ సెటైరిక్‌గా మాట్లాడారు. లోకేష్ గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసునని, ముఖ్యమంత్రి గారి కొడుకు అని, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నారు. ప్రభుత్వం, ఖజానా, తాళాలు అన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నాయన్నారు. అంతా వాళ్లిష్టమని, వాళ్లేమైనా చేసుకోనీ అన్నారు.

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేసిందంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఐదు పదుల వయసులోనూ తన డ్యాన్స్ ఫర్‌ఫార్మెన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది మాధురీ. రేణుక సహానే, మాధురీ 1994లో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని సీన్ ను మరోసారి రిపీట్ చేశారు ఈ ఇద్దరు తారలు. మాధురీ తాజాగా బకెట్ లిస్ట్ అనే మరాఠీ డెబ్యూట్ మూవీ చేస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో మాధురీ తన కోస్టార్ రేణుక సహానేతో కలిసి డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.