Short News

సింగపూర్‌ పాస్‌పోర్ట్‌పై బ్రసెల్స్‌కు పారిపోయిన నీరవ్ మోదీ.!

సింగపూర్‌ పాస్‌పోర్ట్‌పై బ్రసెల్స్‌కు పారిపోయిన నీరవ్ మోదీ.!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ లండన్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడిని దేశానికి రప్పించేందుకు బ్రిటన్‌ అధికారులతో భారత్‌ చర్చలు జరుపుతోంది. అయితే తాజాగా అతడు బ్రసెల్స్‌ పారిపోయినట్లు తెలుస్తోంది. సింగపూర్‌ పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తున్న నీరవ్‌.. ప్రస్తుతం బ్రసెల్స్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు నీరవ్‌ మోదీ ఆచూకీపై భారత్‌ ఇచ్చిన ‘డిఫ్యూసన్‌ నోటీసు'కు బ్రిటన్‌ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
సెర్బియాపై స్విట్జర్లాండ్‌ విజయం

సెర్బియాపై స్విట్జర్లాండ్‌ విజయం

రష్యా వేదికగా జరుగుతోన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి సెర్బియా-స్విట్జర్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్విస్‌ 2-1 తేడాతో విజయం సాధించింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాలకే సెర్బియా ఆటగాడు అలెగ్జాండర్‌ మిట్రోవిక్ గోల్‌ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో అర్ధభాగంలో 52వ నిమిషంలో, 90వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ ఆటగాళ్ళు గోల్స్ చేయటంతో విజయం స్విస్‌ సొంతమైంది. ఈ విజయంతో స్విట్జర్లాండ్‌ గ్రూప్-ఈలో 4పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
దారుణం: చిక్ మంగళూరులో బీజేపీ కార్యదర్శి హత్య

దారుణం: చిక్ మంగళూరులో బీజేపీ కార్యదర్శి హత్య

కర్నాటక చిక్‌మంగళూరులో దారుణం జరిగింది. చిక్‌మంగళూరు బీజేపీ కార్యదర్శి మొహ్మద్ అన్వర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత రాత్రి తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా గౌరీ కెనాల్ వద్ద గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి కత్తితో నరికారు. అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిన అన్వర్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

దక్షిణకొరియా మాజీ ప్రధాని అస్తమయం

దక్షిణకొరియా మాజీ ప్రధాని అస్తమయం

దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్‌ జోంగ్‌ పిల్‌ (92) కన్నుమూసారు. ద.కొరియా నిఘా సంస్థ వ్యవస్థాపకులు అయిన కిమ్ రెండు సార్లు దేశ ప్రధానిగా పనిచేసారు. అనారోగ్య సమస్యలతో కిమ్‌ పిల్‌ మరణించినట్లు సియోల్‌లోని సూన్‌చున్‌హైయాంగ్‌ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కిమ్‌ స్థాపించిన కొరియన్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ తర్వాత నేషనల్‌ ఇంటలిజెన్స్‌ సర్వీస్‌గా మారింది. 1971-75 కాలంలో, 1998-2000 సమయంలో కిమ్‌ జోంగ్‌ పిల్‌ ప్రధానిగా పనిచేసారు. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more