Short News

మే18న రెండున్నర గంటల పాటు రైల్వే సర్వీసులు రద్దు

మే18న రెండున్నర గంటల పాటు రైల్వే సర్వీసులు రద్దు

రెండున్నర గంటల పాటు ఢిల్లీ పీఆర్‌ఎస్‌ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. మే 18న రాత్రి 11.45 గంటల నుంచి మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు ఢిల్లీ కంప్యూటరైజ్డ్‌ పీఆర్‌ఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నామని, ఈ క్రమంలో రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 139 ఎంక్వైరీ సర్వీసులు, టిక్కెట్ల బుకింగ్‌ ఏమీ అందుబాటులో ఉండవని తెలిపింది. మే 5న ఇదే మాదిరి కొన్ని గంటల పాటు తమ సర్వీసులను రద్దు చేశాయి.
ఆమోదం పొంద‌ని బ్యాడ్మింట‌న్ కొత్త స్కోరింగ్ విధానం

ఆమోదం పొంద‌ని బ్యాడ్మింట‌న్ కొత్త స్కోరింగ్ విధానం

బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానానికి ఆమోదం లభించలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఆటను ఆకర్షణీయం చేసేందుకు గాను 11 పాయింట్ల ఐదు సెట్ల మ్యాచ్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై అగ్రశ్రేణి క్రీడాకారులతో పాటు చాలా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినా బీడబ్ల్యూఎఫ్‌ వెనక్కి తగ్గలేదు. సర్వ సభ్య సమావేశంలో ఆమోదం లభిస్తే కొత్త స్కోరింగ్‌ విధానాన్ని అమలు చేయాలనుకుంది. అయితే ఓటింగ్‌లో తగినంత మెజారిటీ రాకపోవడంతో ప్రతిపాదనను ఉపసంహరించుకోక తప్పలేదు.   
ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్: ఆ ముగ్గురు కలసి.. కొడుకుని నెత్తిన ఎక్కించుకున్న తారక్, ఎమోషనల్!

ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్: ఆ ముగ్గురు కలసి.. కొడుకుని నెత్తిన ఎక్కించుకున్న తారక్, ఎమోషనల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 35 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ జన్మ దినం నేడు. ఈ పుటిన రోజు ఎన్టీఆర్ కు చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. కెరీర్ పరంగా కూడా ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు. అతడి నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆదివారం రోజు ఫస్ట్ లుక్, టైటిల్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కూతురి చెయ్యి ఎప్ప‌టికీ వ‌ద‌ల‌న‌న్న అమితాబ్‌

కూతురి చెయ్యి ఎప్ప‌టికీ వ‌ద‌ల‌న‌న్న అమితాబ్‌

తండ్రి...అంటే బాధ్యత, భరోసా. ఈ విషయాన్ని బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ చాలా క్యూట్‌గా చెప్పారు. ఓ వైపు తన కూతురు చిన్నారి శ్వేతను ఎత్తుకుని ఆమె చేతిని పట్టుకుని ఉండగా మరో వైపూ ఉన్న ఫోటోలో తండ్రి కూతుళ్లు చేతిలో చేయి వేసుకుని కారిడార్‌లో నడుస్తున్న ఫోటోను ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ‘నేను తన చేతిని పట్టుకున్నాను...ఇప్పటికీ ఆ చేతిని వదలలేదు...ఇంకేప్పటికి వదలను...నా తొలి సంతోషం శ్వేత' అని కామెంట్ చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోను 3 లక్షల మంది లైక్‌ చేశారు.