Short News

మే17న భాగ్యనగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు

మే17న భాగ్యనగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు

కర్ణాటక ఎన్నికలు ముగియగానే పెట్రోలు, డీజిల్ ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. పెరిగాయి. పెరుగుతున్న ధరల కారణంగా పెట్రోల్ 56 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం భాగ్యనగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. లీటరు పెట్రోల్ ధర రూ.79.78వద్ద డీజిల్ ధర రూ.72.60 వద్ద ఉన్నాయి. బుధవారంతో పోలిస్తే పెట్రోల్ 16 పైసలు, డీజిల్ 24 పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు అత్యధిక గరిష్టాలకు చేరుకుంటున్నాయి.
మెక్‌డొనాల్డ్స్ ను తాకిన ‘మీ టూ’ ఉద్య‌మం

మెక్‌డొనాల్డ్స్ ను తాకిన ‘మీ టూ’ ఉద్య‌మం

అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌కూ ‘మీ టూ' ఉద్యమం తాకింది. మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా రెండు నేషనల్‌ అడ్వకసీ గ్రూప్‌లు లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశాయి. తొమ్మిది నగరాల్లో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 10 మంది మహిళల తరుఫున ఈ గ్రూప్‌లు ఈ ఫిర్యాదు దాఖలు చేశాయి. ఈ వర్కర్లలో సెయింట్‌ లూయస్‌కు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. ఉద్యోగుల తక్కువ వేతనాలపై పోరాడుతున్న ఫైట్‌ ఫర్‌ 15 డాలర్స్‌ ఈ వివాదాన్ని నిర్వహిస్తోంది. ఈ కేసులకు అవసరమయ్యే లీగల్‌ కాస్ట్‌లను టైమ్స్‌ యూపీ లీగల్‌ డిఫెన్స్‌ ఫండ్‌ భరిస్తోంది.   
టెర్ర‌రిస్టుల ఫోన్లు పోలీసులు కూడా గుర్తించ‌లేరు

టెర్ర‌రిస్టుల ఫోన్లు పోలీసులు కూడా గుర్తించ‌లేరు

ల‌ష్క‌రే ఈ తోయిబా టెర్ర‌రిస్టుల విచార‌ణ ద్వారా ఎన్ఐఏకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు తమలో తాము ఉపయోగించుకోవడానికి మొబైల్ హ్యాండ్‌సెట్లను తయారు చేసుకున్నట్లు వెల్లడైంది. వీటిని ఇతరులు గుర్తించే అవకాశమే లేదని తెలుస్తోంది. ఎన్ఐఏకు హమ్జా చెప్పిన వివరాల ప్రకారం లష్కరే తొయిబా విద్యార్థి విభాగం అల్ ముహమ్మదియా స్టూడెంట్స్ ఓ సెల్‌ఫోన్ పరికరాన్ని తయారు చేశారు. ఈ హ్యాండ్‌సెట్లను ఈ సంస్థ ఉగ్రవాదులు తమలో తాము మాట్లాడుకోవడానికే ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించి చేసే కాల్స్‌ను భారతీయ అధికారులు గుర్తించే అవకాశమే లేదు. 
మ‌ళ్లీ ఆసుప‌త్రిలో చేరిన లాలూ

మ‌ళ్లీ ఆసుప‌త్రిలో చేరిన లాలూ

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో చేరారు. 69 ఏళ్ల లాలూప్రసాద్ యాదవ్‌కు గతంలో గుండె బైపాస్ సర్జరీ అయింది. జనరల్ సర్జన్, ఫిజీషియన్, నెఫ్రాలజిస్టు, డయాబెటాలజిస్ట్, కార్డియాలజిస్ట్‌లతో కూడిన వైద్య బృందం లాలూకు వైద్యపరీక్షలు నిర్వహించనుంది. దావా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు వైద్య పరీక్షల కోసం జార్ఖండ్ హైకోర్టు ఆరు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూ గతేడాది డిసెంబర్ 23 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.