Short News

ఆగస్టు సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం

ఆగస్టు సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం

గత కొంత కాలంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను మార్పులు చేయని విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగే సమీక్షలో వడ్డీరేట్లలో పావు శాతం కోత విధించే అవకాశముందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ తెలిపింది. వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించినా ద్రవ్యోల్బణం మాత్రం పెరగనున్నట్లు అంచనా వేసింది. జనవరిలో 5.1శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.7 శాతానికి తగ్గే అవకాశముందని పేర్కొంది.
పెళ్లికొడుకుకు కట్నంగా కొండముచ్చు

పెళ్లికొడుకుకు కట్నంగా కొండముచ్చు

హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొండముచ్చును వరుడికి కట్నంగా ఇచ్చార‌న్న వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఫతేహాబాద్ జిల్లాలోని తోహానా పట్టణానికి చెందిన సంజయ్ పూనియాకు జింద్ జిల్లాకు చెందిన రీతూ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. రిద్దరికీ ఫిబ్రవరి 11న వివాహం జరిపించారు. వదువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లినప్పుడు పొలం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. ఇక్కడ పంటను కోతులు నాశనం చేయడాన్ని ఆయన చూశారు. త్వరలో  కొండముచ్చును తీసుకురావాలని అనుకుంటున్నానని మామతో చెప్పాడు. దీంతో వధువు తండ్రి చందీ రామ్ కట్నం బహుమతిగా కొండముచ్చును వ‌రుడికి ఇచ్చాడు.
మహిళపై ముఖ్యమంత్రి అత్యాచారం ..?

మహిళపై ముఖ్యమంత్రి అత్యాచారం ..?

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపిస్తుంది. సీఎం నాపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ పోలీసులు కానీ నమ్మలేద‌ని చెబుతోంది. త‌న‌పై అత్యాచారం జరిగినప్పుడు పేమా ఖండూ సీఎం పదవిలో లేడంటోంది. ఇప్పుడు ఆయ‌న‌ సీఎం ప‌ద‌విలో ఉండ‌టంతో త‌న మాటలు ఎవ్వరూ నమ్మడం లేదని వాపోతుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. న్యాయం కోసం నా తుదిశ్వాస వరకూ పోరాడుతూనే ఉంటాను అని బాధితురాలు తెలిపింది.
అది చివరి అస్త్రం: పవన్ కళ్యాణ్-జగన్‌లకు చంద్రబాబు, రాజీనామా అంటే ఎలా

అది చివరి అస్త్రం: పవన్ కళ్యాణ్-జగన్‌లకు చంద్రబాబు, రాజీనామా అంటే ఎలా

అవిశ్వాస తీర్మానం అంశంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. అవిశ్వాసం చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలని చెప్పారు. అన్ని ప్రయత్నాలు విఫలమైతే దానికి తాము సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడున్నరేళ్లుగా ఎదురు చూశామని చంద్రబాబు చెప్పారు. అన్ని ప్రయత్నాల తర్వాత అవసరమైతే అవిశ్వాసం పెడతామని చెప్పారు. అవిశ్వాసం కోసం 54 మంది ఎంపీల మద్దతు అవసరమని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటే దేనికైనా సిద్ధమని చెప్పారు. ఎంపీలు రాజీనామా చేయాలని చెబుతున్నారని, అలా చేస్తే పార్లమెంటులో మనకు ఇచ్చిన హామీలపై ఎలా పోరాడుతామన్నారు.