Short News

100 బిలియన్‌ డాలర్ల మైలురాయి దాటిన రిలయన్స్

100 బిలియన్‌ డాలర్ల మైలురాయి దాటిన రిలయన్స్

ప్రముఖ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 11ఏళ్ళ తర్వాత 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. కంపెనీ షేరు ధర 52 వారాల గరిష్ఠానికి చేరింది. వరుసగా ఐదో రోజు రిలయన్స్‌ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్ననేపథ్యంలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6.88లక్షల కోట్లను దాటింది. 2007 అక్టోబర్‌ తర్వాత మరోసారి ఈ మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం కంపెనీ షేరు బీఎస్‌ఈలో 5.66శాతం పెరిగి రూ.1,095 వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్‌ఈలో 5.37శాతం పెరిగి రూ.1,094.60 వద్ద కొనసాగుతోంది.
సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ఇకపై!

సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ఇకపై!

ఇటీవల మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ప్రేక్షకుల బయట నుంచి ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేందుకు వీలుగా ఆగష్టు 1 నుంచి నిబంధనలు అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కార్ కూడా దీనిఫై నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు స్పందించారు.

ప్రభుత్వం నిర్ణయంపై సినీ అభిమానుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. థియేటర్ యాజమాన్యాలు పరిమితికి మించిన ధరలతో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

రంజీ ట్రోఫీలో 9 కొత్త జ‌ట్ల‌కు స్థానం

రంజీ ట్రోఫీలో 9 కొత్త జ‌ట్ల‌కు స్థానం

రంజీ ట్రోఫీలో 9 కొత్త జట్లు దర్శనమివ్వనున్నాయి. దీంతో రానున్న సీజన్‌ నుంచి 37 జట్లు పోటీపడతాయి. ఈమేరకు 2018-19 దేశవాళీ సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 9 కొత్త జట్లు చేరడంతో సీజన్‌లో నిర్వహించే మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 2017కు చేరుకుంది. సీనియర్‌ పురుషులు, మహిళలు.. అండర్‌-16 (బాలబాలికలు) వయోపరిమితి వరకు మొత్తం 2017 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కొత్తగా చేరిన వాటిలో అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌, మణిపూర్‌, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరాఖండ్ ఉన్నాయి.   
అమ్మని బ్రతికించడం కోసమే స్మగ్లింగ్.. జబర్దస్ కమెడియన్ హరి కన్నీటి గాధ, భారీ కుట్రలో ఇరుక్కుపోయి!

అమ్మని బ్రతికించడం కోసమే స్మగ్లింగ్.. జబర్దస్ కమెడియన్ హరి కన్నీటి గాధ, భారీ కుట్రలో ఇరుక్కుపోయి!


చాలా క్లిష్ట పరిస్థితుల్లో తాను ఎర్రచందనం స్మగ్లింగ్ చేయవలసి వచ్చిందని బుల్లితెర హాస్య నటుడు హరి తెలిపాడు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన తరువాత హరి మీడియాతో తన కన్నీటి గాదని వివరించాడు. తాను గతంలో ఏం చేసేవాడిని, స్మగ్లింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, తనపై జరిగిన కుట్రలు వంటి విషయాలు హరి మీడియాకు వివరించాడు. తాను స్మగ్లింగ్ మానేసిన తరువాత కూడా శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్సైతో కలసి స్మగ్లిండ్ కొనసాగించాడు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more