Short News

టీవీల రేట్లు త‌గ్గించిన శాంసంగ్‌!

టీవీల రేట్లు త‌గ్గించిన శాంసంగ్‌!

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ తమ కస్టమర్లకు అపుడే పండుగ కానుక ఇచ్చేసింది. శాంసంగ్‌ టీవీల రేట్లను మళ్లీ తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. తన టాప్‌ సెల్లింగ్‌ మోడల్‌ టీవీలపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. వివిధ మోడళ్ల టీవీలపై 5 నుంచి 15 శాతం తగ్గింపు ధరల్లో ఆఫర్‌ చేస్తోంది. ఓ ప‌త్రిక క‌థ‌నం ప్రకారం 32 - 43 అంగుళాల టీవీలపై రూ. 1,000 నుంచి రూ .2,500 వరకు ఈ తగ్గింపు ఉండనుంది. 75 అంగుళాల‌ టీవీలపై రూ.45 వేల దాకా (15 శాతం) తగ్గింపును అందివ్వనుంది. పోటీని అధిగమించేలా ఈ తగ్గింపు ధరలను వెల్లడించింది.   
వర‌దల స‌మ‌యంలో విమాన ఛార్జీలు పెంపు శోచ‌నీయం

వర‌దల స‌మ‌యంలో విమాన ఛార్జీలు పెంపు శోచ‌నీయం

కేరళ, కర్ణాటకల్లో వరద సమయాల్లోనూ ప్రైవేట్‌ విమానయాన సంస్థలు వ్యాపార దృష్టితో ఉండటం శోచనీయమని కేంద్ర మంత్రి సదానంద గౌడ మండిపడ్డారు. సాధారణ వేళల్లో బెంగళూరు-మంగళూరు మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 4 వేలుంటే, ఇప్పుడు రూ.18 వేలకు తాకాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు, రైళ్లు సహా మంగళూరు, కేరళకు వెళ్లే అన్ని రవాణా మార్గాలు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో విమానయానం ఒక్కటే ప్రజలకు ముందున్న ప్రయాణ మార్గమని, దీన్ని ఆసరాగా చేసుకుని చాలా ప్రైవేటు సంస్థలు ఛార్జీలను అమాంతం పెంచేశాయి.   
న‌లువైపుల నుంచి కేర‌ళ‌కు ఆర్థిక సాయం

న‌లువైపుల నుంచి కేర‌ళ‌కు ఆర్థిక సాయం

ముప్పేట వరదలతో అతలాకుతలమైన కేరళకు నలువైపుల నుంచి ఆర్థిక సాయం వ‌స్తోంది. రూ.10 కోట్ల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపుతున్నట్లు అమ్మ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు అమృతానందమయి చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ రూ.10 కోట్ల చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ప్రముఖ ప్రసార మాధ్యమ సంస్థ స్టార్‌ ఇండియా కేరళ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. రూ.25 లక్షల సాయం చేయనున్నట్లు ఆసియానెట్‌ ఉద్యోగులు చెప్పారు.   
మారన్ సోదరులు విచారణ ఎదుర్కోవలసిందే: సుప్రీంకోర్టు

మారన్ సోదరులు విచారణ ఎదుర్కోవలసిందే: సుప్రీంకోర్టు

దశాబ్దం క్రితం నాటి బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని కళానిధి మారన్ , కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్‌లకు సుప్రీం కోర్టు సూచించింది. దయానిధి మారన్, కళానిధి మారన్‌లపై కేసు కొట్టివేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ ఆ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. 12 వారాల్లో విచారణ పూర్తి చేసి వారిపై అభియోగాలను నమోదు చేయాలని ఆదేశించింది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more