Short News

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ప్రారంభంలో ప్రతికూలంగా ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు, చివరికి పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 113 పాయింట్ల లాభంలో 34,305 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంలో 48 పాయింట్ల వద్ద ముగిసాయి. నేటి ట్రేడింగ్‌లో సిప్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌ 5 శాతం వరకు ర్యాలీ జరిపాయి. టాటా మోటార్స్‌ సుమారు 5 శాతం వరకు నష్టపోయింది. ఇన్ఫోసిస్‌ షేర్లు 3 శాతం మేర నష్టాలతో ముగిసాయి. విప్రో, ఎస్‌బీఐ, టెక్‌ మహింద్రా, ఎయిర్‌టెల్‌లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 158 పాయింట్లు పైకి ఎగిసింది.
బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని నిర్వాహకులు భావిస్తున్నార‌ట‌. మాజీ ప్రేమికులైన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారట. బిగ్‌బాస్‌ సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపికైతే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు.
సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

అమరావతి: సెక్స్‌వర్కర్లకు పునరావాసం కోసం ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని పలువురు సామాజిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మానవ అక్రమ రవాణాపై సోమవారం సచివాలయంలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహణ జరిగింది.

మీలో క్రికెట్  టాలెంట్‌ ఉందా..?

మీలో క్రికెట్ టాలెంట్‌ ఉందా..?

టీం ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరెస్టెన్‌ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్‌ స్కౌట్‌ కార్యక్రమం ప్రారంభించాడు. భారత్‌లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు. టాప్‌లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నాడు. టాప్‌లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్‌స్టెన్‌ క్రికెట్‌లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు.