Short News

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకున్న నిర్ణయం దేశీయ మార్కెట్లను దెబ్బ తీసింది. దీంతో ఆసియా మార్కెట్లు బలహీనంగా సాగాయి. ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. మదుపర్లు అమ్మకాల ఒత్తిడితో గురువారం సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒడుదొడుకుల్లో సాగిన సెన్సెక్స్ చివరకు 139 పాయింట్ల నష్టంతో 35,600 వద్ద నిఫ్టీ 49 పాయింట్ల నష్టంతో 10,808 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.66గా కొనసాగుతోంది.  
రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

పెద్డపల్లి జిల్లా కాట్నపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంథని కృష్ణవేణి పాఠశాల యజమాని అరుణ్ కుమార్ భార్య సౌమ్యతో పాటు ఇద్దరు చిన్నారులు అఖిలేశ్‌, సౌమ్యలు హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
‘లస్ట్’ సీన్‌పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ

‘లస్ట్’ సీన్‌పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ

'భరత్ అనే నేను' హీరోయిన్ బ్యూటీ కియారా అద్వానీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం ఆమె నటించిన 'లస్ట్ స్టోరీస్' అనే హిందీ మూవీలోని ఓ సీన్ లీక్ అవ్వడమే! భర్త వల్ల సెక్స్ లైఫ్‌లో సరైన తృప్తి పొందని ఒక సాధారణ మధ్యతరగతి మహిళ పాత్రలో కియారా నటించారు. ఇలాంటి సీన్లలో చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనే ప్రశ్నకు కియారా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'ఈ సీన్ చేసేటపుడు ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడలేదు

అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 'కెప్టెన్‌'లు

అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 'కెప్టెన్‌'లు

రైలు ప్రయాణికుల సమస్యలు సత్వర పరిష్కారానికి రైల్లో కెప్టెన్‌ల నియామకానికి రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని, దురంతో తదితర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అందుతున్న సేవలను అన్ని రైళ్ళలో అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విజయవాడ, హైదరాబాద్ రైల్వే డివిజన్లలో గురువారం నుంచి ప్రారంభించారు. ఈ సేవలు 24గంటలూ అందుబాటులో ఉంటాయి. ఏసీ, స్లీపర్‌ ప్రయాణికులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా కెప్టెన్‌ సేవలు పొందవచ్చు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more