Short News

నీరవ్ మోదీ,మాల్యా అప్పగింతలో బ్రిటన్ కొత్త మెలిక

నీరవ్ మోదీ,మాల్యా అప్పగింతలో బ్రిటన్ కొత్త మెలిక

భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటన్ గండికొట్టింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 75 వేల మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే. వారందరినీ దేశం నుంచి పంపించేందుకు సహకరిస్తేనే వారిని అప్పగిస్తామని షరతు పెట్టింది. తమ దేశంలోని అక్రమ వలసదారులను బహిష్కరించే విషయంలో తమ వాదనను గౌరవించకపోతే బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో పునరాలోచించుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్టు సమాచారం.
జూన్‌ 19 నుంచి 21 వరకు ఏపీలో పాఠశాలలకు సెలవులు

జూన్‌ 19 నుంచి 21 వరకు ఏపీలో పాఠశాలలకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం 3 రోజులు సెలవు ప్రకటించింది.అధిక ఉష్ణోగ్రతల కారణంగా జూన్‌ 19 నుంచి 21 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతవరణ శాఖ సూచనల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు కూడా తప్పని సరిగా సెలవులు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసారు.
ఈఫిల్ టవర్‌ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ కవచం

ఈఫిల్ టవర్‌ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ కవచం

పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అమర్చనున్నారు.  2015, నవంబరు13న పారిస్‌, సెయింట్ డెనీస్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి నాటి నుంచి ఈఫిల్‌ టవర్‌కు భద్రతను పెంచారు.ఈ దానిలో 130మంది ప్రాణాలు కోల్పోయారు. 1063 అడుగుల ఎత్తైన టవర్‌ రక్షణ బాధ్యత తీసుకున్న సేతె కంపెనీ ఉత్తరం, దక్షిణం వైపున బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఏర్పాటు చేస్తుండగా, తూర్పు, పశ్చిమ ప్రాంతాల వైపు లోహపు కంచెలను, ట్రక్కు దాడులను అడ్డుకోవడానికి 420 బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారు.
చందా కొచ్చర్ లాంగ్ లీవ్: ఐసీఐసీఐ బ్యాంక్ సీఓఓగా సందీప్

చందా కొచ్చర్ లాంగ్ లీవ్: ఐసీఐసీఐ బ్యాంక్ సీఓఓగా సందీప్

వీడియోకాన్ మోసం కేసు నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించాలని బోర్డు నిర్ణయించింది. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఆమె సెలవులోనే ఉండనున్నారు. బ్యాంక్‌ సీఓఓగా సందీప్‌ బక్షి బాధ్యతలు నిర్వహించనున్నారు. కొచ్చర్‌ సెలవులో ఉన్నంతకాలం ఆయన బ్యాంక్‌ బోర్డుకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆయన ప్రస్తుతం ఐసీఐసీఐ జీవిత బీమా విభాగం హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more