Short News

పదేళ్ళ వయసులో ప్రేమించా..కానీ చెప్పలేదు

పదేళ్ళ వయసులో ప్రేమించా..కానీ చెప్పలేదు

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అభిమానులకు వీడియో సందేశం ద్వారా వాలంటైన్స్ డే విషెస్ తెలిపాడు. ఆమీర్‌ఖాన్ చిన్నతనంలోనే ప్రేమలో పడిన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. పదేళ్ళ వయసులో టెన్నిస్‌ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో తన వయసున్న అందమైన బాలికను చూడగానే తొలిసారి ప్రేమలో పడిపోయాడట. ఆమె కోసం అందరికన్నా ముందే ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్ళేవాడట. ఆమె చుట్టూ తిరిగాడే కానీ ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పే ధైర్యం చేయలేదని చెప్పుకొచ్చాడు.  
బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి పలు కొత్త ఆఫర్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి పలు కొత్త ఆఫర్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌టీవీ-99, ఎస్‌టీవీ-319, ప్లాన్‌-999, ప్లాన్‌-949, డేటా ఎస్‌టీవీ-7 పేరుతో ఈ ప్లాన్లు తీసుకొచ్చింది. ఉన్నాయి. ఎస్‌టీవీ-319, 99 ప్లాన్లు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ప్లాన్‌ 999, 949, డేటా ఎస్‌టీవీ-7 ప్లాన్‌  అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి ఈనెల 28 వరకు మెగా సిమ్‌ మేళా నిర్వహిస్తోంది. ఉచితంగా 3జీ సిమ్‌తో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్‌ టాక్‌టైమ్‌ లభిస్తాయి.
'పీఎన్‌బీ' నా దారులన్నీ మూసేసింది

'పీఎన్‌బీ' నా దారులన్నీ మూసేసింది

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మెగా స్కాంలో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్‌మోదీ బ్యాంకుపై ఎదురుదాడికి దిగాడు. బ్యాంకు యాజమాన్యం తన దారులన్నింటినీ మూసివేసిందని ఆరోపిస్తూ లేఖ రాసాడు. పీఎన్‌బీ ఇప్పటికైనా ఫైర్‌స్టార్‌ గ్రూపునకు చెందిన ఆస్తులను విక్రయించి, బకాయిలు తీర్చే అవకాశం ఇవ్వాలని కోరాడు. బ్యాంకు ఖాతాలు, ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో ఇపుడిక మొత్తం బకాయిలను తీర్చటం సాధ్యం కాదని పేర్కొన్నాడు.
ఎన్నికల్లో పోటీ చేస్తే ఓప్రాను చిత్తుగా ఓడిస్తా

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓప్రాను చిత్తుగా ఓడిస్తా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా దిగ్గజం ఓప్రా విన్‌ఫ్రేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభద్రతా భావంతో ఆమె ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తోందని పేర్కొన్నారు. ఆమె తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తే చిత్తుగా ఓడించి తీరతానన్నారు. ఓప్రా ప్రస్తుతం సీబీఎస్‌ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ట్రంప్‌ ఏడాది పాలనపై చర్చిస్తూ ట్రంప్‌ పై విమర్శలు చేస్తుండటంతో ఆయన స్పందించారు.