Short News

క‌ర్ణాట‌క ప‌రిణామాలు 'ఓట‌ర్' సినిమాలాగే ఉన్నాయట‌

క‌ర్ణాట‌క ప‌రిణామాలు 'ఓట‌ర్' సినిమాలాగే ఉన్నాయట‌

క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌పై హీరో మంచు విష్ణు స్పందించారు. క‌న్న‌డ‌నాట ఎన్నికల తీర్పు తాను నటిస్తున్న ‘ఓటర్' సినిమాలాగే ఉందని అన్నారు. ‘వాట్‌ ఎ ట్విస్ట్‌ సర్‌ జీ. కర్ణాటక తీర్పు ఇంచుమించు నేను నటిస్తున్న ‘ఓటర్' సినిమాలాగే ఉంది.' అని ట్వీట్‌ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదా పడుతూ వస్తోంది. ‘ఎన్నికలు పూర్తయ్యాక హామీల ఊసే ఉండదు. అప్పుడు ఓటరు నేతలపై తిరగబడితే ఎలా ఉంటుంది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.' అని గతంలో దర్శకుడు కార్తిక్‌ వెల్లడించారు.
రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

అరుణాచల్‌ప్రదేశ్‌‌ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు మొదలు పెట్టింది. 40 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు ఆదివారం ఓ మీడియా నివేదిక వెల్లడించింది. చైనా ఆధ్వర్యంలోని టిబెట్‌లోని ల్హున్జె ప్రాంతంలో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఇది భారత్ సరిహద్దు వెంటే ఉందని హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అయితే దక్షిణ టిబెట్‌ను తన దేశంలో భాగంగా చేసుకోనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింద'ని వెల్లడించింది.
చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

పంజాబ్‌ జట్టు అద్భుతాలేమీ చేయలేదు. ప్లేఆఫ్స్‌ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన ఆ జట్టు 5 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో మట్టికరించింది. మొదట లుంగి ఎంగిడి (4/10) సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేయడంతో పంజాబ్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సురేశ్‌ రైనా (61 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో చెన్నై 5 బంతులుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రాయుడు (1), డుప్లెసిస్‌ (14), బిల్లింగ్స్‌ (0) విఫలమవడంతో చెన్నై 27/3తో కష్టాల్లో పడింది.  హర్భజన్‌ (19), దీపక్‌ చాహర్‌ (39) చెలరేగి ఆడి జట్టుపై ఒత్తిడి తగ్గించారు.
స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వశం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఐదు చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. మొద‌టిది మొబైల్ డేటా ఆఫ్ చేయ‌డం. దీని ద్వారా మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. రెండోది రోజులో కొంత సమయం గ్యాడ్జెట్స్ ప‌క్క‌న పెట్టి ఆటలు, సంగీతం, సమాజ సేవ వంటి వాటికి స‌మ‌యం కేటాయించడం. మూడోది ఫోన్లో అన‌వ‌స‌ర క‌బుర్లు చెప్ప‌డం ఆపాలి. నాలుగు.. నిద్ర‌పోయే ముందు సెల్ ఫోన్ వాడొద్దు. చివ‌రిది.. కొన్నాళ్లు సాధార‌ణ మోడ‌ల్ ఫోన్ వాడండి.