Short News

అందుకే సోష‌ల్ మీడియాలోకి రాలేదుః కంగ‌న‌

అందుకే సోష‌ల్ మీడియాలోకి రాలేదుః కంగ‌న‌

సామాజిక మాధ్యమాలు వాడ‌క‌పోవ‌డంపై బాలీవుడ్ క్వీన్ కంగ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ‘‘అనేక కారణాల వల్ల నేను సోష‌ల్ మీడియా వేదికలపైకి రాలేదు. ఇందుకు కారణం ఏంటంటే.. ఇది సమయాన్ని ఎక్కువ తినేస్తుంది.'' అని కంగ‌న అన్నారు. ‘ఖాతాను ప్రారంభించండి.. దాని నిర్వహణ మేం చూసుకుంటాం' అని కొన్ని బ్రాండ్స్‌ నిర్వాహకులు కూడా చెప్పారని కంగన వెల్ల‌డించారు. ‘‘సోష‌ల్ మీడియాలో ఉంటే నిజాయతీగా లేకుండా.. లక్షల మంది అభిమానులతో తప్పుడు బంధాలు సృష్టించుకుని, వారిని మోసం చేస్తున్నాను అనే భావన నాకు కలుగుతుంది' అని ఆమె అన్నారు.   
క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రమంతటికీ ఒకటి, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్య నేతృత్వంలో జేడీఎస్ మ్యానిఫెస్టో రూపొందించ‌నుంది.     
ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోమారు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అస్పష్ట సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్‌బుక్‌ను కోరింది. సమాచారం దుర్వినియోగం చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించింది.
నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల పరిష్కారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం చంద్రబాబుతో భేటీకి రానీ అఖిల.. గురువారం అమరావతికి బయలుదేరారు.బుధవారం అఖిలప్రియ రాకపోవడంతో ఈ సమావేశం వాయిదాపడింది. చంద్రబాబుతో భేటీకి బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి ఉండవల్లికి చేరుకున్నారు. కానీ అఖిల గురువారం వస్తానని చెప్పారు.