Short News

శ్రీరెడ్డి కోసం అవ‌స‌ర‌మైతే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష

శ్రీరెడ్డి కోసం అవ‌స‌ర‌మైతే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష

న‌టి శ్రీరెడ్డికి మొదటి నుంచి తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన న‌టి అపూర్వ ఆమెకు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక హింసపై ఆమె అనేక విషయాలు వెల్లడించారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు ఆదివారం చర్చ వేదికను ప్రారంభించారు. ఈ సందరర్భంగా అపూర్వ మాట్లాడుతూ న్యాయం కోసం అవ‌స‌రమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాన‌ని ప్రకటించారు. తాము మాట్లాడుతుంటే కొందరు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   
ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోమారు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అస్పష్ట సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్‌బుక్‌ను కోరింది. సమాచారం దుర్వినియోగం చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించింది.
నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల పరిష్కారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం చంద్రబాబుతో భేటీకి రానీ అఖిల.. గురువారం అమరావతికి బయలుదేరారు.బుధవారం అఖిలప్రియ రాకపోవడంతో ఈ సమావేశం వాయిదాపడింది. చంద్రబాబుతో భేటీకి బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి ఉండవల్లికి చేరుకున్నారు. కానీ అఖిల గురువారం వస్తానని చెప్పారు.

నాకు ఏదైనా జరిగితే 'పవన్ కళ్యాణ్'దే బాధ్యత

నాకు ఏదైనా జరిగితే 'పవన్ కళ్యాణ్'దే బాధ్యత

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కత్తి మహేశ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసాడు. 'పవన్ ఫ్యాన్స్ మరోసారి బూతులు తిట్టడం, బెదిరించడం, ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. నా ఫోన్‌ నంబర్‌ బయటపెట్టారు. నా అడ్రస్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి నా మీద దాడి చేయాలని ప్లాన్‌ చేయడం, నాకు ఫోన్‌ చేసి బెదిరించడం అసహ్యంగా ఉంది. భరించలేకుండా ఉంది. నాకు ఏమైనా జరిగితే అందుకు పవన్‌దే బాధ్యత. మై సెక్యూరిటీ ఈజ్‌ పవన్‌ రెస్పాన్సిబిలిటీ' అని పేర్కొన్నారు.