Short News

అమ్మాయిలు 'కన్యత్వం' కోల్పోతే తప్పేముంది.?

అమ్మాయిలు 'కన్యత్వం' కోల్పోతే తప్పేముంది.?

యువ నటి యాషిక ఆనంద్‌(19) వివాదంలో చిక్కుకుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్ళికి ముందే అమ్మాయిలు కన‍్యత్వం కోల్పోతే తప్పేం కాదని వ్యాఖ్యానించింది. అడల్ట్‌ హర్రర్‌ కామెడీగా తెరకెక్కిన 'ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు' చిత్రంలో నటించిన ఆమె చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'పెళ్ళికి ముందు అబ్బాయిలు ఎలా అయితే కన్యత్వాన్ని కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. అందులో తప్పు కూడా లేదు' అని వ్యాఖ్యానించింది. ఇదే ఇంటర్వ్యూలో ఆమె బూతు డైలాగులు, అడల్ట్‌ జోకులు కూడా పేల్చింది.
'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

క్వాంటికో టెలివిజన్ సిరీస్ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా కొంత విరామం తర్వాత బాలీవుడ్‌లో నటిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ అనే చిత్రం చేస్తున్న ఈ భామ సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రాన్ని అంగీకరించింది. 'ఇమ్యునోడెఫిషియన్సీ' వ్యాధితో మృతి చెందిన 18 ఏళ్ళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రంలో అయేషాగా జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తుందని సమాచారం. ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ నటించే అవకాశాలున్నాయి.  పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలి ఏసీ బస్ షెల్టర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంగళవారం ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాధించింది.

రాజకీయ నేపథ్య చిత్రంతో నమిత రీ-ఎంట్రీ.!

రాజకీయ నేపథ్య చిత్రంతో నమిత రీ-ఎంట్రీ.!

నటి నమిత 'ఎంగల్‌ అన్నా' చిత్రంతో తమిళతెరకు పరిచయమై కొన్నేళ్ళ పాటు అగ్ర నాయికగా కొనసాగారు. చెన్నైలో సెటిల్‌ అయిన అమ్మడికి  అవకాశాలు తగ్గటంతో గతేడాది నిర్మాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిందని భావిస్తున్న తరుణంలో త్వరలో మరోసారి కథానాయికగా కనిపించనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకుడు టి.రాజేందర్‌ స్వీయ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో నమిత ప్రతినాయకిగా నటించనున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.