Short News

పేరు మార్చుకున్న న‌టి శ్రీరెడ్డి

పేరు మార్చుకున్న న‌టి శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న శ్రీరెడ్డి తాజాగా ఆమె తన పేరును శ్రీ శక్తిగా మార్చుకుంది. పేరును మార్చుకోవడం వెనకున్న కారణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.‘‘పోరాటంలోకి వచ్చిన తర్వాత అంతా శ్రీరెడ్డి అని పిలిచేవారు. ఎవ్వరికీ స‌మ‌స్య‌ లేకపోయినా ఎవరూ ఆ క్యాస్ట్ ఫీలింగ్‌తో లేకపోయినా.. నీ పేరు ఏంటి అంటే శ్రీరెడ్డి అని చెప్పడానికి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ తీసుకువస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే అందరూ సూచించిన మీదట శ్రీ శక్తిగా పేరు మార్చుకున్నాను'' అని శ్రీరెడ్డి వెల్లడించింది.    
29కల్లా అండమాన్‌లో అల్పపీడనం

29కల్లా అండమాన్‌లో అల్పపీడనం

ప్రస్తుతం అండమాన్‌ సముద్ర పరిసరాల్లో నెలకొన్న పరిస్థితుల fవల్ల ఈనెల 29కల్లా అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక బుధవారం పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగి 40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు

ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు

యాంకర్ రవీ తన ట్విట్టర్ అకౌంట్ పై క్లారిటీ ఇచ్చాడు. గత రెండ్రోజులుగా  ట్విట్టర్ ఖాతా నుంచి కొన్ని మీడియా చానల్స్‌ను దూషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే ఆ కామెంట్లతో తనకెలాంటి సంబంధం లేదని యాంకర్ రవి స్పష్టం చేశాడు. అదంతా ఎవరో సృష్టించారని వాపోయాడు. తన పేరిట అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసు పెడతానంటూ హెచ్చరించాడు. మీడియా మిత్రులెవరూ ఆ ట్వీట్స్ గురించి కన్ఫ్యూజ్ కావొద్దని రవి విజ్ఞప్తి చేశాడు.
జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్

జగన్ ఆ దమ్ముందా? పవన్ నిరూపించు:మంత్రి లోకేష్ ఫైర్

శ్రీకాకుళం:ప్రతిపక్ష నేత జగన్, జగనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ కు ప్రధాని మోడీని విమర్శించే దమ్ముందా? ...అని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కమాట కూడా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం జగన్ చేయలేడని లోకేష్ ఎద్దేవా చేశారు.మరోవైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పై లోకేష్ ఆచి తూచి స్పందించారు. పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.