Short News

పుండుపై కారం చల్లారు.. ఇక అల్లు అర్జున్ ఫాన్స్ ఊరుకుంటారా మరి?

పుండుపై కారం చల్లారు.. ఇక అల్లు అర్జున్ ఫాన్స్ ఊరుకుంటారా మరి?


కానీ ఈ రోజు మాత్రం బన్నీ అభిమానుల ఆగ్రహానికి లోనయింది చిత్రయూనిట్. ఎందుకంటే.. అలా.. వైకుంఠపురములో సినిమా నుంచి రెండో పాటను నేడు (అక్టోబర్ 21) సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. తీరా ఆ సమయానికి హాండిచ్చి ఇవ్వాళ కాదు రేపు అనేసింది. దీంతో దానికోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బన్నీ అభిమానులకు పుండుపై కారం చల్లినట్లుగా అనిపిస్తోంది. అసలే బన్నీ విజయం కోసం పరితపిస్తూ ఉన్న వీళ్లకు ఆయన సినిమా యూనిట్ వాళ్ళే హాండివ్వడం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ప్రభాస్‌కు స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్.. ఓకే చేశాడా.!

ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ప్రభాస్‌కు స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్.. ఓకే చేశాడా.!

'కేజీఎఫ్' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయ్యాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమాలో యశ్‌ను ఎంతో ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. దీనికితోడు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఈ సినిమా తర్వాత ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది బడా నిర్మాతలు ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఆయన మాత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన టాలీవుడ్‌లోని ఓ బడా హీరోకు కథను వినిపించారట.

పవన్ కల్యాణ్‌పై దారుణమైన పోస్టును పెట్టిన శ్రీరెడ్డి.. ఆయన భార్యను కూడా వదల్లేదు.!

పవన్ కల్యాణ్‌పై దారుణమైన పోస్టును పెట్టిన శ్రీరెడ్డి.. ఆయన భార్యను కూడా వదల్లేదు.!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్‌పై ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆయన భార్యను కూడా వదల్లేదు.

వరుణ్ తేజ్ సినిమాను దాటలేకపోయిన సైరా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్న చిరు

వరుణ్ తేజ్ సినిమాను దాటలేకపోయిన సైరా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తాజాగా ఓ మైలురాయిని చేరుకుంది.