Short News

అమలాపాల్ కు లైంగిక వేధింపుల వెనక అసలు కథ ఇది..

అమలాపాల్ కు లైంగిక వేధింపుల వెనక అసలు కథ ఇది..

కొద్ది రోజుల కిత్రం తనకు కు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు సినీ నటీ అమలాపాల్. టీ నగర్ లో డాన్స్ స్కూల్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించిన అళగేశన్ అనే వ్యక్తి వెనక పెద్ద ముఠానే ఉందని ఆరోపిస్తోంది. తనతో మలేషియాలో కొందరు బడా బాబులువ్యాపారం చేయాలని ప్లాన్ చేశారని ట్విటర్ ద్వారా తెలిపింది. మరోవైపు అళగేశన్ విచారిస్తున్న పోలీసులు ఈ కేసులో మలేషియాకు చెందిన మరోకరిని అరెస్ట్ చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
మూడునెలల కనిష్టానికి పడిపోయిన రూపాయి

మూడునెలల కనిష్టానికి పడిపోయిన రూపాయి

మార్కెట్‌లో దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీనపడింది. ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకుండా.. మరింత దిగజారి తాజాగా మరోసారి మూడునెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు డాలర్‌​ మారకంలో రూపాయి 67 మార్క్‌కు పడిపోవడానికి దగ్గరలో​ ఉంది. 0.41పైసలు క్షీణించి 66.80 వద్దకు చేరింది. దిగుమతిదారుల నుంచి నెలవారీ డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడింది.
అల్లు అర్జున్ స్థానంలో రవితేజ. త్వరలో సినిమా ప్రారంభం!

అల్లు అర్జున్ స్థానంలో రవితేజ. త్వరలో సినిమా ప్రారంభం!

రవితేజ కొత్త సినిమా ఒప్పుకున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిస్కో రాజా పేరుతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉందినిర్మాత రామ్ తాళ్లూరి తో ఎస్.ఆర్.టి బ్యానర్ లో రవితేజ ప్రస్తుతం 'నేలటికెట్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి రవితేజతో ఈ నిర్మాత సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిస్కో రాజా పేరుతో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం.

న‌క్సల్స్ చ‌ర్య‌ల‌తో గిరిజ‌నుల్లో ఆందోళ‌న‌

న‌క్సల్స్ చ‌ర్య‌ల‌తో గిరిజ‌నుల్లో ఆందోళ‌న‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం పెడమిడిసిలేరు-తాలిపేరు ప్రాజెక్టు మధ్యగల కాజ్‌వేని నిషిద్ధ మావోయిస్టు నక్సలైట్లు ధ్వంసం చేశారు. దీంతో సమీప గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఏజెన్సీలో నక్సలైట్లు ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పక్కనే ఉన్న దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇప్పటికే ఆయా ఘటనలకు పాల్పడ్డ నక్సలైట్లు తాజాగా కాజ్ వే ను ధ్వంసం చేయడంతో గిరిజన ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.