Short News

‘బడుంబా’ పదానికి అర్థం చెప్పిన మెగాస్టార్
<iframe width="654" height="401" src="https://www.youtube.com/embed/U1OjeCB9dRY" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

‘బడుంబా’ పదానికి అర్థం చెప్పిన మెగాస్టార్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తను ఎప్పుడూ వాడే ‘బడుంబా' పదానికి అర్థం చెప్పారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘102 నాటౌట్‌' సినిమాలో ‘జుంబా జుంబా బడుంబా..' అనే పాటను బిగ్‌బి పాడారు. ఈ పాట వీడియోను ట్విటర్‌లో విడుదల చేశారు. అయితే ఆదివారం సీఎస్‌కే, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా విరామ సమయంలో కామెంటేటర్‌ కపిల్‌ దేవ్‌ ఈ పాటను విడుదల చేశారు. అనంతరం అమితాబ్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. పాట మొదట్లో బడుంబా పదానికి అర్థం వివరిస్తూ..‘బడుంబా అంటే జోష్‌. ఆనందం కలిగిస్తుందన్నారు అమితాబ్.
‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి

‘భూమా’తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో సైకిల్‌ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌పై బాబు యూటర్న్ ఎందుకు?: సోము ఫైర్

గవర్నర్‌పై బాబు యూటర్న్ ఎందుకు?: సోము ఫైర్

గవర్నర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. నాలుగేళ్లుగా మంచివారిగా ఉన్న గవర్నర్ నర్సింహన్.. ఒక్కసారిగా చంద్రబాబుకు చెడ్డవారిగా ఎందుకు కనిపిస్తున్నారని ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. ఏపీ సీఎం తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోరని విధంగా 'ప్రజలే నన్ను రక్షించాలి'అని చంద్రబాబు కోరడం విచిత్రంగా ఉందన్నారు.

ఫేస్‌బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాలకు నోటీసులు

ఫేస్‌బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాలకు నోటీసులు

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థలకు భారత ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఇచ్చిన సమాధానంలో స్పష్టత లేని నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్‌బుక్‌ను కోరింది.