Short News

రాజమౌళికి జపాన్ అభిమాని అద్భుతమైన బహుమతి

రాజమౌళికి జపాన్ అభిమాని అద్భుతమైన బహుమతి

దర్శక దిగ్గజం రాజమౌళికి ఓ అభిమాని అద్బుమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే విదేశాల్లో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి అండ్ టీం అక్కడ బాహుబలి 2 కు వస్తున్న రెస్పాన్స్‌కు ఫిదా అయిపోయారు. రాజమౌళి తన టూర్‌ను విజయవంతంగా ముగించుకుని జపాన్ వాసులు బహూకరించిన అరుదైన బహుమతులతో తిరిగొచ్చాడు. తనకు వచ్చిన గిఫ్ట్ ప్యాక్స్‌ను ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కోటిగా చూపిస్తూ ఉన్న ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు . బాహుబలి చిత్రం థీమ్‌తో గీసిన చిత్రాలు గిఫ్ట్ ఫ్యాక్‌లో ఉన్నాయి. ప్రతీ బహుమతిని అద్భుతమైన కళతో రూపొందించారు.
నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. పీఎన్‌బీని భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి చెందిన రూ.170 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఆస్తుల అటాచ్‌మెంట్‌ మాత్రమే కాక నీరవ్‌ మోదీ, అత‌డి సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ అటాచ్‌ చేసుకుంది.    
బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయట. రోజుకు 2, 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. లివర్‌లో ఉన్న కొవ్వు కరుగుతుంది. నిత్యం 2 కప్పుల కన్నా ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
అదిరిపోయేలా టీ20 లీగ్ ఫైన‌ల్ సంబ‌రాలు

అదిరిపోయేలా టీ20 లీగ్ ఫైన‌ల్ సంబ‌రాలు

టీ20 లీగ్ ఫైనల్‌ను అదిరిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వనున్నాడు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్ అహుజా తదితరులు కూడా వేదికను పంచుకోనున్నారు. క్రికెట్ అభిమానుల‌ను ఆకర్షించేందుకు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మరాఠీ, మలయాళం బ్రాడ్‌కాస్టర్లు కూడా ముందుకొచ్చారు. మరాఠీ బ్రాడ్‌కాస్టర్లు నిర్వహించే సంబరాల్లో మాధురీ దీక్షిత్, స్వప్నిల్ జోషి పాల్గొననున్నారు.