Short News

మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఒకరోజు ముందే రచ్చ..

మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఒకరోజు ముందే రచ్చ..

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో భరత్‌ అనే నేను రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Chiranjeevi's response to Sridevi's death News

Chiranjeevi's response to Sridevi's death News

శ్రీదేవి మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమెతో చేసిన సినిమాలు, ఆమె గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు. తన సహచర నటి మరణాన్ని తట్టుకోలేక పోయిన ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. 'అందం, అభినయం కలగలిపిన అత్యధ్భుత నటి శ్రీదేవి . అలాంటి నటీమణి అంతకు ముందు లేదు. భవిష్యత్తులో కూడా వస్తారని అనుకోను. మా అతిలోక సుందరి ఈ రకంగా అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే మింగుడు పడని చేదు నిజం. భగవంతుడు చాలా అన్యాయం చేశాడు.' అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

నా  జన్మదినం రోజు శ్రీదేవిని చివరి సారి చూశా

నా జన్మదినం రోజు శ్రీదేవిని చివరి సారి చూశా

శ్రీదేవి హాఠాన్మరం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణవార్త విని తాను షాక్‌ గురయ్యానని తెలిపారు. శ్రీదేవి అకాల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆమె విషయంలో భగవంతుడు చాలా అన్యాయం చేశాడని అన్నారు. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి'లో ఇంద్రజ పాత్ర తన కోసమే పుట్టిందా? అన్నట్లు నటించి మెప్పించిందన్నారు. చిరు తన 60వ జన్మదినం రోజున.. ఆమెను ప్రత్యక్షంగా చూడటం అదే ఆఖరిసార అని గుర్తు చేశారు.
షేమ్: శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ దారుణంగా, నెటిజన్ల ఆగ్రహం

షేమ్: శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ దారుణంగా, నెటిజన్ల ఆగ్రహం

బాలీవుడ్ నటి శ్రీదేవి మృతిపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హఠాన్మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన పూర్తి ట్వీట్ చదివిన తర్వాత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడటంతో ఆ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. శ్రీదేవి మృతికి సంతాపం తెలపడం ఓకే.. కానీ తామే అవార్డు ఇచ్చామని ప్రకటించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.