Short News

రంగస్థలం, అర్జున్ రెడ్డికి ధీటుగా భరత్ అనే నేను!

రంగస్థలం, అర్జున్ రెడ్డికి ధీటుగా భరత్ అనే నేను!

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ''త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా'' అంటూ మహేష్ బాబు చెప్పిన లేటెస్ట్ పంచ్ డైలాగ్ మారు మ్రోగుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.భరత్ అనే నేను సినిమలో ఇటువంటి డైలాగ్స్ మరెన్నో ఉన్నాయని చిత్ర దర్శకుడు కొరటాల శివ చెబుతున్నాడు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భారి ఫైట్స్, రిచ్ లొకేషన్స్ లో సాంగ్స్ ఉండబోతున్నాయి.

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

దేశీయ టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో పెను సంచలనం సృష్టించింది. 2018-19లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జియోలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీరు డైట్ సోడాను ఇష్టపడే వారైతే, ఇది మీకు చెడు వార్త కావచ్చు. కృత్రిమ స్వీటెనర్లతో తయారుచేసిన తక్కువ కేలరీలు గల పానీయాలు & స్నాక్స్ మీకు మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్యాలను కలుగజేసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యాయనంలో నిర్ధారించబడింది. వాటితో పాటు గుండె జబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. ఈ వ్యాసం ద్వారా మనము కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాల గూర్చి పూర్తిగా తెలుసుకోబోతున్నాం.

కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాలను నమోదు చేశారు.

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

నటి సాయిపల్లవి 'కణం' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నాగశౌర్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రానికి ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ అవుతున్న సందర్భంగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడింది. 'ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రలో షేడ్స్‌ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందానని అనుకుంటున్నాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్‌ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే' అని చెప్పింది.