Short News

భరత్ అనే నేనులో హైలెట్ సీన్స్ అవేనట!

భరత్ అనే నేనులో హైలెట్ సీన్స్ అవేనట!

భారి అంచనాల మధ్య ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భరత్ అనే నేను. కొరటాల శివ, మహేష్ బాబు కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కైరాఅద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిత్రంలోని కొన్ని సీన్స్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.భరత్ అనే నేను సినిమాలో ప్రధానంగా ధియేటర్ ఫైట్ హైలెట్ కాబోతోందని తెలుస్తోంది.

‘టోట‌ల్ డమాల్’ ఫస్ట్ లుక్ చూశారా.?

‘టోట‌ల్ డమాల్’ ఫస్ట్ లుక్ చూశారా.?

బాలీవుడ్ లో మరో సారి క్రేజీ కాంబోతో టోట‌ల్ డమాల్ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్ర‌కుమార్‌. తాజాగా అనీల్ క‌పూర్‌, మాధురీ దీక్షిత్‌ల ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చిత్రానికి సంబంధించిన పిక్ అనే టాక్ వినిపిస్తుండ‌గా, ఇందులో మాధురీ దీక్షిత్ భుజంపై రెండు చేతులు వేసి డిఫ‌రెంట్ స్టిల్ ఇచ్చాడు అనీల్ క‌పూర్‌. కామెడీ యాంగిల్ లో ఈ మూవీని దర్శకుడు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రం ఉంటుందని దర్శకుడు ఇంద్ర కుమార్ అంటున్నారు.
జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని ఓ వైపు విషాదాన్ని దిగమింగుతూ తన తొలి సినిమాను పూర్తి చేసింది. యువ హీరో ఇషాన్ కట్టర్‌తో ఆమె నటిస్తున్న దఢక్ చిత్ర షూటింగ్ పూర్తయింది. దాంతో జాహ్నవి, ఇషాన్ ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. దఢక్ షూటింగ్ పూర్తయిన రోజే తన తొలి సినిమా బియాండ్ ది క్లౌడ్స్ రిలీజ్ కావడంతో ఇషాన్ ఆనందం రెండితలైంది. దఢక్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు శశాంక్ ఖైతాన్, జాహ్నవి తండ్రి, నిర్మాత బోనికపూర్ తదితరులు హాజరయ్యారు.

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రమైన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం చిన్నారులపై అత్యాచారాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. పోస్కో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం జరిపివారికి మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.