Short News

బిగ్ బాస్ 2 ఐదో రోజు హైలెట్స్: ఏడ్చేసిన తేజస్వి... బోర్ కొట్టించిన గొడవలు!

బిగ్ బాస్ 2 ఐదో రోజు హైలెట్స్: ఏడ్చేసిన తేజస్వి... బోర్ కొట్టించిన గొడవలు!

బిగ్ బాస్ 2 గురువారం (జూన్ 14)న ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు, ఫన్ ఎలిమెంట్స్ లేక పోగా ఇంటి సభ్యులు గొడవ పడ్డ పడుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఒక్కటంటే ఒక్క ఆసక్తికర మూమెంట్ కూడా లేక పోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ప్రేక్షకుల్లో బిగ్ బాస్ 2 మీద ఆసక్తి మరింత తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్‌గా గురువారం ప్రసారమైన ఎపిసోడ్ బిగ్ బాస్ షో అంటేనే ప్రేక్షకులు బోర్‌గా ఫీలయ్యే పరిస్థితి వచ్చింది.

‘లస్ట్’ సీన్‌పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ

‘లస్ట్’ సీన్‌పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ

'భరత్ అనే నేను' హీరోయిన్ బ్యూటీ కియారా అద్వానీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం ఆమె నటించిన 'లస్ట్ స్టోరీస్' అనే హిందీ మూవీలోని ఓ సీన్ లీక్ అవ్వడమే! భర్త వల్ల సెక్స్ లైఫ్‌లో సరైన తృప్తి పొందని ఒక సాధారణ మధ్యతరగతి మహిళ పాత్రలో కియారా నటించారు. ఇలాంటి సీన్లలో చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనే ప్రశ్నకు కియారా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'ఈ సీన్ చేసేటపుడు ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడలేదు

అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 'కెప్టెన్‌'లు

అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 'కెప్టెన్‌'లు

రైలు ప్రయాణికుల సమస్యలు సత్వర పరిష్కారానికి రైల్లో కెప్టెన్‌ల నియామకానికి రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని, దురంతో తదితర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అందుతున్న సేవలను అన్ని రైళ్ళలో అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విజయవాడ, హైదరాబాద్ రైల్వే డివిజన్లలో గురువారం నుంచి ప్రారంభించారు. ఈ సేవలు 24గంటలూ అందుబాటులో ఉంటాయి. ఏసీ, స్లీపర్‌ ప్రయాణికులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా కెప్టెన్‌ సేవలు పొందవచ్చు.
కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీ ..పాకిస్థాన్‌తో పోరుకు సిద్ధమైన భారత్‌

కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీ ..పాకిస్థాన్‌తో పోరుకు సిద్ధమైన భారత్‌

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరుకు భారత కబడ్డీ జట్టు సిద్ధమైంది. శుక్రవారం నుంచి దుబాయిలో ఆరంభం కానున్న కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌, పాక్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌, ఇరాన్‌, కొరియా లాంటి జట్లు పోటీపడుతుండడంతో ప్రతిష్ఠాత్మకమైన ఆసియా క్రీడలకు ముందు ఈ టోర్నీని సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్‌, కెన్యాలతో కలిసి భారత్‌ గ్రూప్‌- ఎలో ఉంది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more