Short News

హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్లు.. వివరాలివే

హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్లు.. వివరాలివే

దేశీయ మార్కెట్లో చాలావరకు వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే.. హ్యుందాయ్ కంపెనీ మాత్రం ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హ్యుందాయ్ కంపెనీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ నెలలో హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేసేవారు క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే డిస్కౌంట్స్ అనేవి హ్యుందాయ్ వెన్యూ, అల్కాజర్, టక్సన్ మరియు కోనా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపైనా మాత్రమే లభిస్తాయి. కస్టమర్లు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి.
మరింత తక్కువ ధరలో బజాజ్‌ చేతక్‌ ఇ స్కూటర్‌ లాంచ్‌

మరింత తక్కువ ధరలో బజాజ్‌ చేతక్‌ ఇ స్కూటర్‌ లాంచ్‌

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో బజాజ్ ఆటో తన చేతక్ బ్రాండ్ క్రింద మరింత అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. చేతక్ బ్రాండ్‌లో కొత్త మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మేలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
వెస్పా 140 వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..

వెస్పా 140 వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..

ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. భారత్‌లో కూడా ఈ కంపెనీ దశాబ్ధాల కాలం నుంచి కస్టమర్లకు సేవలందిస్తోంది. కొంత కాలం పాటు దేశీయ OEMల భాగస్వామ్యంతో పనిచేసిన వెస్పా.. గత దశాబ్ద కాలంగా స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. ఈ క్రమంలో వెస్పా.. ఓ గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది.
గూగుల్‌ మ్యాప్స్‌లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లపై అప్‌డేట్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లపై అప్‌డేట్‌

ఈ రోజుల్లో గూగుల్‌ మ్యాప్స్‌(Google Maps) లేకుండా కొత్త రూట్లలో ప్రయాణించడం చాలా కష్టం. ఎవరినీ అడగకుండా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్‌తో ఏ చిక్కూ లేకుండా సులభంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అందుకే మెట్రో సిటీల్లో ఎక్కువగా దీనిపై ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇక్కడుంది.