Short News

6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు..

6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు..

భారత్‌లో హోండా బైక్‌లు, స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా హోండా మోటార్‌సైకిల్‌ మరియు స్కూటర్‌ ఇండియా భారత మార్కెట్లో ఆధిపత్యం(Honda Sales In India) చెలాయిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రముఖ సంస్థ గణనీయమైన మైలురాయిని సాధించింది. 6 కోట్ల దేశీయ విక్రయాలతో కంపెనీ చారిత్రక మైలురాయిని సాధించి రికార్డు సృష్టించింది.
ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో

ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో

మనం రోజు నిత్యా జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు చూస్తూ ఉంటాము. అందులో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన మాత్రం చూసేవారిని ఒక్కసారిగా షాక్కు షాక్‌కు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది. స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ పోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది అని మీకు సందేహం కలగొచ్చు. కానీ నిశితంగా పరిశీలిస్తే.. ఆ మహిళా తలకు ఒక స్కార్ఫ్ (గుడ్డ)తో గట్టిగా కట్టి ఉంది. ఆమె చెవి దగ్గర చూస్తే మొబైల్ ఫోన్ ఉండటం గమనించవచ్చు. ఇది చూడగానే వాట్ ఏ ఐడియా సర్జీ అనుకున్నారా?
నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!

నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!

టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో వ్యవస్థల్లో కూడా భారీ మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఫాస్టాగ్'(FASTag) విధానానికి కేంద్రం మంగళం పాడటానికి సిద్ధమైపోయింది. త్వరలో జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టం అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
వేసవిలో మీ కారులో వీటిని ఉంచకండి..

వేసవిలో మీ కారులో వీటిని ఉంచకండి..

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఈ సారి ఓ నెల ముందుగానే వచ్చాడు. మార్చి నెల మొదటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో(Car Precautions For Summer) ఉష్ణోగ్రతలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక ఈ సమయాల్లో వాహనాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.