Short News

స్వచ్ఛభారత్ కంటే ముందు 'స్చేచ్ఛ భారత్' కావాలి

స్వచ్ఛభారత్ కంటే ముందు 'స్చేచ్ఛ భారత్' కావాలి

కాశ్మీర్‌లో ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిపిన అత్యాచారం, హత్యోదంతం భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనను ఖండించిన బాలీవుడ్ తారలు ఆదివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. 'జస్టిస్ ఫర్ ..' అనే ప్లకార్డులతో తారలు రోడ్లపైకి వచ్చారు. స్వచ్ఛభారత్ కంటే ముందు స్చేచ్ఛ భారత్ కావాలి అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సమీరారెడ్డి, కరీనా కపూర్, స్వర భాస్కర్, సోనమ్ కపూర్, శృతి సేథ్, మినీ మాథుర్, ట్వింకిల్ ఖన్నా, రాజ్ కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు.
క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రమంతటికీ ఒకటి, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్య నేతృత్వంలో జేడీఎస్ మ్యానిఫెస్టో రూపొందించ‌నుంది.     
ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌, అనలిటికాకు మరోమారు నోటీసులు

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగంపై కేంబ్రిడ్జి అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరోమారు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా అస్పష్ట సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం రెండు సంస్థలపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి పనులకు భారతీయుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఫేస్‌బుక్‌ను కోరింది. సమాచారం దుర్వినియోగం చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించింది.
నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

నేను ఉండగా.. ఎలా?: బాబు ముందు అఖిలప్రియ ప్రశ్నలు!

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల పరిష్కారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం చంద్రబాబుతో భేటీకి రానీ అఖిల.. గురువారం అమరావతికి బయలుదేరారు.బుధవారం అఖిలప్రియ రాకపోవడంతో ఈ సమావేశం వాయిదాపడింది. చంద్రబాబుతో భేటీకి బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి ఉండవల్లికి చేరుకున్నారు. కానీ అఖిల గురువారం వస్తానని చెప్పారు.