Short News

‘అన్నీ కోతి మొహాలే, రామానాయుడు ఆస్తులు అమ్ముకున్నాడు, కానీ వీరు.....’

‘అన్నీ కోతి మొహాలే, రామానాయుడు ఆస్తులు అమ్ముకున్నాడు, కానీ వీరు.....’

'సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్' అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శృతి సంచలన కామెంట్స్ చేశారు. శివాజీ రాజా మీద, పవన్ కళ్యాణ్, ఇతర హీరోల మీద ఆమె ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఏమిటీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంతకాలం ముసుగులో గుద్దులాటలాగా ఉండేది. ఇపుడు మేమంతా చెబుతుంటే జనాలకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందని తెలిపారు.

క్విజ్ పోటీలో గెలిస్తే ఉచితంగా విమాన టికెట్లు

క్విజ్ పోటీలో గెలిస్తే ఉచితంగా విమాన టికెట్లు

క్విట్ పోటీలో గెలుపొందితే చాలు ఉచితంగా నెదర్లాండ్ ను సందర్శించవచ్చు. ఏప్రిల్‌ 27న నెదర్లాండ్స్‌ రాజు కింగ్‌ విలియమ్‌ అలెగ్జాండర్‌ పుట్టినరోజు పురస్కరించుకొని జెట్‌ ఎయిర్‌వేస్‌, కేఎల్ఎమ్‌ రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానయాన సంస్థలు కలిసి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి. పోటీలో పది ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారిలో రెండు జంటలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. వారికి దిల్లీ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు వెళ్లడానికి టికెట్లను జెట్ ఎయిర్‌ వేస్‌ అందిస్తుంది.ఈ పోటీ ఏప్రిల్ 30 ఉదయం తొమ్మిది గంటలకు ముగుస్తుంది.   
మహేస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

మహేస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

మ‌హేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' బాక్సాఫీస్ దగ్గర వసూళ్లలో రికార్డు సాధిస్తుంది. ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో భారీ ఎత్తున విజ‌యోత్స‌వ వేడుక జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. ఏప్రిల్‌ 27న తిరుపతి అలిపిరి రోడ్డులోని నెహ్రు మున్సిపల్‌ పాఠశాల మైదానంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ప్ర‌క‌టించారు. కాని ఏపీలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలం లేని నేప‌థ్యంలో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ వాయిదా వేశారు. త్వ‌ర‌లో కొత్త డేట్ మ‌రియు వేదిక వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ప్రకటించారు.
స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..13 మంది చిన్నారులు మృతి

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..13 మంది చిన్నారులు మృతి

ఉత్తర ప్రదేశ్‌ కుశినగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యారు.డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన వ్యాన్‌ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్‌ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది.