Short News

మళ్లీ వస్తా... ప్రాధాన్యత కలిగిన పాత్రలే చేస్తా

మళ్లీ వస్తా... ప్రాధాన్యత కలిగిన పాత్రలే చేస్తా

దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు తగిన పాత్రలు వస్తేనే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు .. కనుక ఇప్పుడు చేయవచ్చని అనుకుంటున్నానని తెలిపారు. మళ్లీ నటన వైపుకు వెళ్లడం వలన నలుగురిని కలవడం .. మాట్లాడటం జరుగుతుందని. మనసుకి కాస్త ఊరట కలుగుతుందనే ఉద్దేశంతోనే అటుగా ఆలోచిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
అద్భుతమైన ఫీచర్ తో ‘వీవో వై53ఐ’ ఫోన్ విడుదల

అద్భుతమైన ఫీచర్ తో ‘వీవో వై53ఐ’ ఫోన్ విడుదల

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై53ఐ ని సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో సెల్ఫీ కెమెరా ద్వారా ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. 5 ఇంచ్ డిస్‌ప్లే గల ఈఫోన్ లో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రూ.7,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బేటీ బచావో, బేటీ పడావో అన్నది మోదీ పాత నినాదమని, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బచావో అంటున్నారని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ ఇవాళ ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో రాహుల్ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో సుమారు రెండు కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారన్నారు. తమ మనసుల్లో ఏముందో 2019లో ప్రజలు మన్‌కీ బాత్ ద్వారా వెల్లడిస్తారని చ‌మ‌త్క‌రించారు.    
మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్  సినిమా

మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్ సినిమా

ఇటీవల ఎమ్మెల్యే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు కల్యాణ్ రామ్. నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే మరో సినిమా చేయబోతున్నాడట. ఏప్రిల్‌ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  నివేదా థామస్‌, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు.