Short News

నీహారిక 'హ్యాపీ వెడ్డింగ్' ఫస్ట్ ఇన్విటేషన్

నీహారిక 'హ్యాపీ వెడ్డింగ్' ఫస్ట్ ఇన్విటేషన్

మెగా డాటర్ నిహారిక, సుమంత్ అశ్విన్‌ నటించిన చిత్రం 'హ్య‌పీ వెడ్డింగ్'. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.   రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. ఈ చిత్రం ఈ నెలాఖ‌రులో లేదా వ‌చ్చే నెల ఆరంభంలో విడుద‌ల కానుంది.
షాకింగ్: నటి ఎదుటే కారులో హస్తప్రయోగం చేసిన డ్రైవర్!

షాకింగ్: నటి ఎదుటే కారులో హస్తప్రయోగం చేసిన డ్రైవర్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుమిత్ రాఘవన్ భార్య చిన్మయి ఓ గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై ముంబైలోని విలెపార్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి వద్ద వైట్ కలర్ బీఎండబ్ల్యూ కారులో కూర్చున్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, తనను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఆన్లైన్ లో దుమ్మురేపుతున్న భోజ్‌పురి 'జీఎస్టీ' పాట
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/SHzFaFFhNUs" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

ఆన్లైన్ లో దుమ్మురేపుతున్న భోజ్‌పురి 'జీఎస్టీ' పాట

భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్ లాల్ యాదవ్ రూపొందించిన హోలీ సాంగ్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. జీఎస్టీ, వరకట్నం అంశాలను ప్రస్తావించిన ఈ పాట సూపర్‌హిట్ అయింది. దినేష్ లాలే పాడి నటించిన ఈ పాటలో ఆమ్రపాలి దూబే నటించింది. దినేష్ లాల్, ఆమ్రపాలి దూబెలు భోజ్‌పురి పరిశ్రమలో టాప్ స్టార్లు కావటంతో ఫిబ్రవరి 15న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన నాలుగు రోజుల్లోనే 32 లక్షల వ్యూస్ వచ్చాయి.
బాఘీ -2 తర్వాత 'భాఘీ-3' ..అతడే హీరో

బాఘీ -2 తర్వాత 'భాఘీ-3' ..అతడే హీరో

బాలీవుడ్‌ చిత్రం 'భాఘీ' నుంచి మరో సీక్వెల్ రాబోతోంది. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించారు. మూడో భాగంలో కూడా టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా నటిస్తాడని నిర్మాత సాజిద్‌ నడియా వాలా ప్రకటించారు. మూడో భాగానికి అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తాడు. తెలుగు హిట్ సినిమా 'క్షణం' రీమేక్‌గా తెరకెక్కిస్తున్న బాఘీ-2లో దిశా పఠానీ నాయిక. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది.