Short News

చెప్తే నమ్మరు కానీ.. నాకు కూతురు పుడితే, కాలేజీ రోజుల్లో పోలీస్ స్టేషన్ దాకా?: నిఖిల్

చెప్తే నమ్మరు కానీ.. నాకు కూతురు పుడితే, కాలేజీ రోజుల్లో పోలీస్ స్టేషన్ దాకా?: నిఖిల్

కెరీర్‌లో వరుస ఫ్లాపుల తర్వాత 'స్వామి రారా' సినిమాతో అనూహ్యంగా హిట్ ట్రాక్ ఎక్కాడు హీరో నిఖిల్. అప్పటిదాకా చేసిన మూస కథల నుంచి బయటకొచ్చి.. పూర్తి స్థాయి వైవిధ్యమున్న కథలను ఎంచుకోవడమే అతని సక్సెస్ సీక్రెట్.స్వామి రారా నుంచి అదే ట్రెండ్ కొనసాగిస్తున్న నిఖిల్.. తాజా సినిమా 'కిరాక్ పార్టీ'తోనూ హిట్ కొడుతానన్న ధీమాతో ఉన్నాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నాడు.

మరో గడ్డి స్కాం కేసులోను లాలూ ప్రసాద్ నేరస్తుడు

మరో గడ్డి స్కాం కేసులోను లాలూ ప్రసాద్ నేరస్తుడు

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగో ఫోడర్ స్కాంలోను నిందితుడిగా రాంచీ కోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా తేల్చింది.రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగో ఫోడర్ స్కాంలోను నిందితుడిగా రాంచీ కోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా తేల్చింది.

బ్యాంకుల్లో రూ.11,300కోట్ల డిపాజిట్లు  ఎవరివో తెలియదు

బ్యాంకుల్లో రూ.11,300కోట్ల డిపాజిట్లు ఎవరివో తెలియదు

దేశవ్యాప్తంగా 64 బ్యాంకుల్లో రూ. 11,300కోట్లు ఎవరివో తెలియని డిపాజిట్లుగా ఉన్నాయని ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. దాదాపు 3కోట్లకు పైగా ఖాతాల్లో ఈ సొమ్ము నిల్వ ఉందని తెలిపింది. వీటిలో అత్యధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ. 1,262కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ. 1,250కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌గా ఉన్నాయి. ఇక మిగతా అన్ని జాతీయ బ్యాంకుల్లో కలిపి రూ. 7,040కోట్లు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 1,416కోట్లు అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. మిగతా రూ.332కోట్లు మన దేశంలో కొనసాగుతున్న 25 విదేశీ బ్యాంకుల వద్ద ఉన్నాయి.
మరో గోల్‍‌మాల్.. వెలుగులోకి భారీ కుంభకోణం: యాక్సిస్ బ్యాంకుక

మరో గోల్‍‌మాల్.. వెలుగులోకి భారీ కుంభకోణం: యాక్సిస్ బ్యాంకుక

బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన మరో కంపెనీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంకును రూ. 4 వేల కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై పారేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

పీఏఎల్ కు చెందిన భవర్ లాల్ భండారీ, ప్రేమాల్ గోరగాంధీ, కమలేష్ కనుంగో అనే ముగ్గురిపై చీటింగ్, ఫోర్జరీ, నమ్మక ద్రోహం వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టామని తెలిపారు. యాక్సిస్ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు పేరకు విచారించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.