Short News

చైనీయుల‌ను ఆక‌ట్టుకున్న‌ ‘హిందీ మీడియం’!

చైనీయుల‌ను ఆక‌ట్టుకున్న‌ ‘హిందీ మీడియం’!

ఇండియన్‌ సినిమాలు చైనాలో భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ నటించిన ‘హిందీ మీడియం' సినిమా చైనాలో ఇప్పటికే రూ. 184 కోట్లను రాబట్టిందని మార్కెట్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అతి త్వరలోనే రెండు వందల కోట్ల రూపాయ‌ల మార్క్‌ను చేరుకుంటుందని ఆయ‌న అంచ‌నా వేశారు. అమెరికా తరువాత చైనాలో ఇండియన్‌ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. దీంతో బీ టౌన్‌ ప్రస్తుతం చైనా మార్కెట్‌ వైపు చూస్తోంది. వాస్తవికత, సహజతత్వానికి దగ్గరకు ఉన్న కథలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.   
కళ్యాణి లీక్స్ ..ఇవి శ్రీరెడ్డి ఫోటోలేనా.!

కళ్యాణి లీక్స్ ..ఇవి శ్రీరెడ్డి ఫోటోలేనా.!

శ్రీరెడ్డి వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. నటి కరాటే కళ్యాణి ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ చేసింది. 'పెళ్ళి కాని విమల(శ్రీరెడ్డి)కు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి వచ్చింది. విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేసింది. అమ్మతో 10 సంవత్సరాలు నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌పల్లి లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువ గల ప్లాట్‌లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేసారు.? ఏంటో, విమల నీకే తెలియాలి మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా' అని పేర్కొంది.
ప్రతీ ఛానెల్ ఒక మాఫియాలా?, నాకు ఇద్దరు కూతుళ్లు.. భయంగా ఉంది

ప్రతీ ఛానెల్ ఒక మాఫియాలా?, నాకు ఇద్దరు కూతుళ్లు.. భయంగా ఉంది

నేటి ఉదయం న్యాయవాదులతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. 'సినిమాకు సెన్సార్ ఉంది. చిన్న పిల్లలు చూడకూడని విషయాలని నిర్మొహమాటంగా తీసేస్తారు. కానీ మీడియాకి సెన్సార్ ఎందుకు లేదు?. టీవి9 రవిప్రకాష్ తనను బ్లాక్ మెయిల్ చేశారని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మరి అలాంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు?.. అంటే ఆయనేదో తప్పు చేశాడనే కదా?..' అని ఆయన న్యాయవాదులతో అన్నారు.

'ప్రతీ ఛానెల్ ఒక మాఫియా లాగా తయారైంది. మీరు మాకు చాలా మానసిక అశాంతిని కలిగిస్తున్నారు. మనకి అసలు వార్తలు అవసరం లేదు. మనం పురాతన కాలం నాటికి వెళ్లిపోదాం.' అని వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ కుదేలు ..చెన్నై ఘన విజయం

రాజస్థాన్ కుదేలు ..చెన్నై ఘన విజయం

టీ20 లీగ్-2018లో చెన్నై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ చతికిలపడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (106) చెలరేగి ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. లక్ష్యచేదనలో చెన్నై బౌలర్ల ధాటికి రాజస్థాన్ 18.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెన్ స్టోక్స్ (44) ఒక్కడే కొంత పోరాట పటిమ చూపించాడు.