Short News

అభిమానులకు ఆర్నాల్డ్ తీపి కబురు

అభిమానులకు ఆర్నాల్డ్ తీపి కబురు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ ‘ఐ యామ్‌ బ్యాక్‌' అంటూ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. ‘‘మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్‌ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్‌ చెప్పాడు. తాను బావున్నాను అని అందరికీ తెలియజేసేందుకు ఓ వీడియో మెసేజ్ పంపాడు. ప్రస్తుతానికైతే ఐ యామ్‌ గుడ్‌. నాకు మంచి డాక్టర్స్, నర్స్ ఉన్నారు. వాళ్లు బాగా కేర్‌ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్‌'' అని పేర్కొన్నారు ఆర్నాల్డ్‌.
ఒక్కో న‌క్స‌ల్ మృత దేహంలో ప‌ది తూటాలు

ఒక్కో న‌క్స‌ల్ మృత దేహంలో ప‌ది తూటాలు

ఇటీవ‌ల గ‌డ్చిరోలిలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్లో ఒక్కో మావోయిస్టు మృతదేహంలో 5 నుంచి 10 తూటాలున్న‌ట్లు పోస్టు మార్టంలో తేలింది. గడ్చిరోలి జిల్లా ఆస్పత్రి మార్చురీలో కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మృతుల కుటుంబ సభ్యులు గుంపులు గుంపులుగా కూర్చుని తమ వారి మృత దేహాల కోసం ఎదురు చూశారు. గడ్చిరోలిలో చాలా చోట్ల వ్యాపార వాణిజ్య సంస్ధలు మూసివేశారు. మృతుల్లో ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 42కు చేరింది. బుధవారం సాయంత్రం ఇంద్రావతిలో ఓ మృతదేహం లభించగా రాత్రికి మరో 4 మృతదేహాలను కనుగొన్నారు.    
ఆయనకు దగ్గరవుతా.. అందుకే ట్విట్టర్ ఖాతా తెరిచా: శ్రీరెడ్డి

ఆయనకు దగ్గరవుతా.. అందుకే ట్విట్టర్ ఖాతా తెరిచా: శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్‌ అంశంతో టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి మరో ఆసక్తికరమైన సోషల్ మీడియాలోని ట్విట్టర్‌లోకి ప్రవేశించారు. 'శ్రీ శక్తి' పేరుతో తాను ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లోనే దుమ్మురేపిన ఈ నటి తాజాగా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇటీవల మా అసోసియేషన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం జాతీయ మీడియాలో సంచలనం రేపింది. ఇలా వివాదాలతో ముందుకెళ్తున్న శ్రీరెడ్డి.. ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేసింది.

కళ్యాణ్ రామ్‌కు ఝలక్.. అందుకు కోన వెంకట్ కారణమట!

కళ్యాణ్ రామ్‌కు ఝలక్.. అందుకు కోన వెంకట్ కారణమట!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ మధ్య ఏంఎల్ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా తరువాత నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. నా నువ్వే తర్వాత కోన వెంకట్ చేప్పిన కథతో సినిమా చేయల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేసినట్టు సమాచారం.కళ్యాణ్ రామ్ ఏంఎల్ఏ సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొన్నాడు. అదే ఊపుతో నా నువ్వే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.