Short News

భార్యను విడిచే పెట్టే ఎన్నారైలకు షాకింగ్ న్యూస్

భార్యను విడిచే పెట్టే ఎన్నారైలకు షాకింగ్ న్యూస్

భార్యపై భర్త వేధింపులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భారత్‌లో పెళ్లి చేసుకుని, కట్నం కానుకలు తీసుకుని భార్యలను విదేశాలకు తీసుకెళ్తున్న భర్త.. భార్యను వదిలేస్తే అతని ఆస్తులు సీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్‌ఆర్‌ఐ భర్తలు, భార్యలను వదిలివేయడం, కట్నం డిమాండ్లు, శారీరక వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. భర్తలు వదిలేసిన మహిళలకు చట్టపరమైన పరిష్కారం లభించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
పీఎన్బీ స్కాంపై నోరు మెదపరేం: మోడీపై రాహుల్ ఫైర్

పీఎన్బీ స్కాంపై నోరు మెదపరేం: మోడీపై రాహుల్ ఫైర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడ్డారు. పరీక్షలకు ఎలా హాజరవ్వాలో గంటలపాటు నరేంద్ర మోడీ విద్యార్థులకు బోధిస్తున్నారని.. అయితే నీరవ్ మోడీ చేసిన మోసాలకు బాధ్యత ఎవరిదో చెప్పడం లేదని ఆరోపించారు. దేశం నుంచి డబ్బును నీరవ్ మోడీ తీసుకెళ్ళిపోయారన్నారు. నరేంద్ర మోడీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి.. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించారన్నారు.

అగ్రిగోల్డ్ తరహా మోసం: ‘బొమ్మరిల్లు’ రాయల రాజా అరెస్ట్

అగ్రిగోల్డ్ తరహా మోసం: ‘బొమ్మరిల్లు’ రాయల రాజా అరెస్ట్

అగ్రిగోల్డ్ తరహాలో ఏపీలో మరో మోసం వెలుగుచూసింది. బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ అధినేత రాయల రాజాను శనివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ తరహాలో బొమ్మరిల్లు సంస్థ కూడా కృష్ణా జిల్లాలో కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడింది. ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 1.5కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం గమనార్హం. డబ్బులు తీసుకుని స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకుండా తమని మోసం చేశారంటూ కొందరు బాధితులు 2104లో మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. తదుపరి విచారణను ప్రభుత్వం సీఐడికి అప్పగించింది.

భయమెందుకు?: టీడీపీ, జగన్ పార్టీలపై పవన్ కీలక వ్యాఖ్యలు: జేఎఫ్‌సీకి ‘ఏపీ సర్కారు’ నివేదిక

భయమెందుకు?: టీడీపీ, జగన్ పార్టీలపై పవన్ కీలక వ్యాఖ్యలు: జేఎఫ్‌సీకి ‘ఏపీ సర్కారు’ నివేదిక

కేంద్రం ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో రెండు రోజుల(శుక్రవారం, శనివారం)పాటు నిర్వహించిన జేఎఫ్‌సీ మేధోమథన సమావేశం విజయవంతమైంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు.