Short News

'కార్వాన్' కోసం ట్వీట్ చేసిన ఇర్ఫాన్

'కార్వాన్' కోసం ట్వీట్ చేసిన ఇర్ఫాన్

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. న్యూరో ఎండోక్రైన్‌ వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్‌ ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. గత రెండు నెలలుగా సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న ఇర్ఫాన్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేసారు. ఇర్ఫాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం '. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌, మిథిలా పాల్కర్‌ జంటగా నటిస్తున్నారు. 'రెండు ప్రయాణాలు.. ఒకటి నాది మరొకటి సినిమాది' అని పేర్కొంటూ సినిమా పోస్టర్ ను షేర్ చేసారు. ఆగస్ట్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఫ్లిప్‌కార్ట్‌  ఆపిల్ వీక్ సేల్..తక్కువ ధరలకు ఆపిల్ ఉత్పత్తులు

ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్ వీక్ సేల్..తక్కువ ధరలకు ఆపిల్ ఉత్పత్తులు

ఆపిల్‌ అభిమానులకు శుభవార్త. ఆపిల్‌ వీక్‌ సేల్‌ పేరుతో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌ను ప్రారంభించింది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్‌ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్‌, ఎంపిక చేసిన ఆపిల్‌ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, మే 27 వరకు జరుగనుంది.   
డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

ఎండాకాలం వచ్చిందంటే కొన్ని చర్మ సమస్యలు కూడా వెంట వస్తాయి. వేసవిని ఆనందంగానే స్వాగతిస్తాము. అయితే, వేసవితో పాటు వెంట వచ్చే చర్మ సమస్యలు మనల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అందులో ముఖ్యంగా మనం సన్ బర్న్ సమస్య గురించి చెప్పుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం కమిలినట్లు మారుతుంది. దీనినే సన్ బర్న్ అనంటారు. సూర్యరశ్మిలో కొన్ని హానికర కిరణాలు చర్మాన్ని తాకడం వలన చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. పీఎన్‌బీని భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి చెందిన రూ.170 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఆస్తుల అటాచ్‌మెంట్‌ మాత్రమే కాక నీరవ్‌ మోదీ, అత‌డి సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ అటాచ్‌ చేసుకుంది.