Short News

మూడు ఆత్మలు, రెండు మృతదేహాలు, జీవిత ప్రయాణం.... ఆసుపత్రి నుండి ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్!

మూడు ఆత్మలు, రెండు మృతదేహాలు, జీవిత ప్రయాణం.... ఆసుపత్రి నుండి ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్!

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధి భారిన పడి లండన్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. న్యూరో ఎండోక్రైన్‌ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ వ్యాధి చాలా తీవ్రమైనదని, ఆయన జీవితం చివరి దశలో ఉందంటూ ఆ మధ్య వార్తలు రావడం అభిమానులను సైతం కలిచి వేసింది. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ అభిమానులు, సన్నిహితుల ఆశీర్వాదంతో తన శక్తిమేర పోరాడతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత దాదాపు 2 నెలల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఇర్ఫాన్ తాజాగా 'కర్వా' ఫస్ట్ లుక్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

కుమరస్వామికి మోడీ అభినందనలు

కుమరస్వామికి మోడీ అభినందనలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కుమారస్వామికి ఫోన్‌ చేసిన ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. కాగా, 'ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేం పనిచేస్తాం. మేమంతా ఒక్కటే అని దేశప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఈనాడు అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. 2019లో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయనేందుకు ఇదొక నిదర్శనం' అని కుమారస్వామి పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి

ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్ద బుధవారం నార్లపూర్‌ భూగర్భ పంప్‌హౌజ్‌లోకి పోయే టన్నెల్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 18 మంది ఉండగా.. అందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బీజేపీయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు.