Short News

ఐష్ కు ఇష్ట‌మైన న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌

ఐష్ కు ఇష్ట‌మైన న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో క‌లిసి ఒకసారైనా నటించాలని నటీనటులంతా కోరుకుంటారు. మరి అలాంటి ఐష్‌కి ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఇంకెవరు తన భర్త అభిషేక్‌ బచ్చనే. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభిషేకే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి సినిమాల్లో సాధారణ వ్యక్తిలాగే కన్పిస్తాడు. స్టార్ కుమారుడు అయినప్పటికీ ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే అభిలో నాకు నచ్చిన విషయం. ఇద్దరం ఓ సినిమా చేయబోతున్నాం. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని పేర్కొన్నారు ఐష్‌. 
స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కీలక సూచీలతోపాటు, బ్యాంక్‌నిఫ్టీ సానుకూలంగా ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 17పాయింట్ల లాభంతో నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో ఉన్నాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తత నేపథ్యంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మ, ఆయిల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌ లాభపడుతుండగా, ఆర్‌కాం, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, పీఎన్‌బీ నష్టపోతున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి నష్టాలనుంచి స్వల్పంగా కోలుకుంది. డాలరు మారకంలో 68 రూపాయల స్థాయినుంచి పుంజుకుని 67.96 వద్ద ఉంది. 
నిన్నటి తరం అభిమానుల వద్దకు వెళ్ళనున్న 'మహానటి'

నిన్నటి తరం అభిమానుల వద్దకు వెళ్ళనున్న 'మహానటి'

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధిస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్ కెరీర్ బెస్ట్ పాత్రను పోషించి మెప్పించింది. చిత్ర నిర్మాణ సంస్థ జూన్ మూడో వారం నుండి 'మ‌హాన‌టి' చిత్రాన్ని ఓల్డేజ్ హోమ్‌లలో ప్రదర్శించనున్నారు. 'మహానటి మీ ద‌గ్గ‌రికే వ‌స్తుంది. త‌న త‌రం వారి ద‌గ్గ‌ర‌కి త‌ర‌లి వ‌స్తుంది' అని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు.
కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కేరళలో మొదలైన 'నిపా' కలవరంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా విస్తరించే ఈ వైరస్‌ సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. నిపా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. నిపా వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతానికి ఈ వైరస్ కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉంది.