Short News

పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స

పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే పది రోజుల క్రితమే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు. వారు పవన్ కంటిని పరీక్షించి, ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్రచికిత్సతోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆయన బుధవారం  హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పవన్‌కు వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
'గాలె' స్టేడియాన్ని కూల్చుతున్న శ్రీలంక ప్రభుత్వం

'గాలె' స్టేడియాన్ని కూల్చుతున్న శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంకలోని గాలె అంతర్జాతీయ స్టేడియం 2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీకి దెబ్బతింది. అనంతరం మరమ్మత్తులు చేసారు. ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. పెవిలియన్ స్టాండ్ వల్ల స్టేడియానికి ఆనుకొని ఉన్న డచ్‌ఫోర్ట్‌ గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
సరికొత్త డిజైన్‌లో గూగుల్ సెర్చ్ యాప్

సరికొత్త డిజైన్‌లో గూగుల్ సెర్చ్ యాప్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరింత కొత్తదనాన్ని పంచే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ సెర్చ్ యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. డీపర్ ఇంప్లిమెంటేషన్‌తో కనిపిస్తోన్నఈ రీడిజైన్ ప్రాసెస్ సరికొత్త మెటీరియల్ డిజైన్‌ను తెరపైకి తీసుకువచ్చేలా ఉంది. ప్రస్తుతానికి టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్న ఈ అప్‌డేట్ ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

చికాగోలో అమ్ముతున్న శివుడి బొమ్మలపై హిందువుల ఆందోళన

చికాగోలో అమ్ముతున్న శివుడి బొమ్మలపై హిందువుల ఆందోళన

చికాగోలోని 'ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ' షోరూంలో విక్రయిస్తున్న శివుని బొమ్మలపై హిందూసంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. శివుని బొమ్మలు పిల్లలు ఆడుకునే సాప్ట్‌టాయిస్ మాదిరిగా ఉండటంతో అమ్మకాన్ని నిలిపివేయాలని, దుకాణం నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. వీరి డిమాండ్లకు తలొగ్గిన స్టోర్ యజమాని శివుని బొమ్మల విక్రయాన్ని నిలిపివేసారు. మ్యూజియం ప్రతినిధి జాకెల్ జాన్స్‌టన్ మాట్లాడుతూ ఫీల్డ్ మ్యూజియం అన్ని మతాలను, సంస్కృతులను గౌరవిస్తుందన్నారు. వివాదాస్పదంగా మారిన శివుని బొమ్మలను వెంటనే తొలగిస్తున్నామని తెలిపారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more