Short News

ట్రెండు ఫాలో అవ్వాలి కదా.... తారక్ కూడా అందులో చేరిపోయాడు!

ట్రెండు ఫాలో అవ్వాలి కదా.... తారక్ కూడా అందులో చేరిపోయాడు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇప్పటికే ట్విట్టర్ ఖాతా మెయింటేన్ చేస్తున్న ఈ నందమూరి హీరో ట్రెండ్ ఫాలో అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేరిపోయారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ వాడకం బాగా పెరిగింది. దీంతో అభిమానులకు టచ్‌లో ఉండేందుకు సెలబ్రిటీలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు లాంటి స్టార్స్ కూడా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచారు.

మహారాష్ట్రలో నేటి నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం

మహారాష్ట్రలో నేటి నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం

మహారాష్ట్రలో శనివారం నుంచి నిషేధం అమల్లోకి వస్తున్నట్లు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రామదాస్‌ కదమ్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, ఉపయోగం, అమ్మకం, నిల్వ, సరఫరాపై నిషేధం విధిస్తున్నట్లు మార్చి 23న వెల్లడించింది. రానున్న ఎనిమిది రోజుల్లో  నిషేధంపై విస్తృతంగా ప్రచారం చేస్తారు. మొదటి సారి పట్టుబడితే రూ.5వేల రూపాయలు, రెండోసారి పట్టుబడితే రూ.10వేలు, మూడోసారి పట్టుబడితే రూ.25వేల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. 
'హీనాఖాన్' యోగా ..నెటిజన్ల ట్రోలింగ్

'హీనాఖాన్' యోగా ..నెటిజన్ల ట్రోలింగ్

ప్రముఖ టీవీ నటి హీనాఖాన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడింది. 'హీనాజీ నువ్వు ముస్లిమ్, అంతే కాకుండా మహిళ అర్ధనగ్నంగా యోగా చేయడం తగదు అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తే 'ముస్లిములకు నమాజ్ చేయడం మంచి యోగాలాంటిదే' అని మరో నెటిజన్ పేర్కొన్నారు. కొందరు నెటిజన్లు హీనాఖాన్ పై అభినందనల వర్షం కురిపించారు. గతంలో హీనా బెల్లీ డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి.
సెక్స్ రాకెట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అనవసరంగా బురదజల్లుతున్నారు!

సెక్స్ రాకెట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అనవసరంగా బురదజల్లుతున్నారు!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలని కూడా సెక్స్ రాకెట్ వ్యవహారం కుదిపేస్తోంది. అవకాశాలు లేక సతమతమవుతున్న హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లతో ఈ సెక్స్ దందా నడిపిస్తునారని యూఎస్ పోలీస్ లు బట్టబయలు చేసారు. ఈ వ్యవహారంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిషన్, చంద్ర దంపతులని యుఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తానా అధ్యక్షుడు సతీష్ వేమన వివరణ ఇచ్చారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more